మిల్కీ బ్యూటీ నోట మహేష్... మహేష్... మహేష్... నువ్వే దిక్కు!

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2013 (12:55 IST)
FILE
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమాలు చాలవన్నట్లు బాలీవుడ్‌కు జంప్ అయిన తమన్నా...ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతోంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి కెరీర్‌ను మలుచుకుంటున్న సమయంలో వున్నట్టుండి హిందీ సినిమా పరిశ్రమకు లగెత్తింది.

అయితే బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుందామనుకున్న ఈ మిల్కీబ్యూటీ అక్కడ చతికిల పడింది. 'హిమ్మత్ వాలా' చిత్రం ఫ్లాపైంది. కానీ తమన్నా గ్లామర్‌, పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో నెంబర్‌వన్ హీరోయిన్ అవకాశాన్ని మిస్ అయినందుకు తెగ బాధపడిపోతున్న ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌పై కన్నేసింది.

తెలుగులో నిలదొక్కుకోవాలంటే మహేశ్ బాబు ఒక్కడే తనకు దిక్కని భావించింది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన 'ఆగడు' చిత్రంలో కూడా తమన్నా ఎంపికైంది. గత కొంత కాలంగా తెలుగులో తమన్నాకు సరైన హిట్ లేదు. దీంతో సౌత్ చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కథ, హీరో, దర్శకుడు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. మహేష్ బాబు తప్ప ఎవరితోనూ వద్దంటున్న తమన్నా ఇప్పుడు మహేష్ నామ జపం చేస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఒక్క హిట్టు కొడితే తన రేంజ్ మరింత పెరుగుతుందనేది తమన్నా ఆలోచన.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అమరావతిలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్.. నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

Show comments