తెలంగాణ వారికి సినిమాల గురించి తెలీదు... నేర్చుకుని... కోదండరామ్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2013 (16:02 IST)
FILE
తెలుగు సినిమాకు తెలంగాణాలో ఢోకా లేదని జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ ఇటీవలే వెల్లడించారు. అయితే.. తెలంగాణా కళాకారులు మాత్రం తామంతా కలిసి ఇండస్ట్రీని నడిపించాలని చూస్తున్నారు. ఇందుకు ఒకప్పుడు దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఆవేశంగా మాట్లాడి... తమ సత్తాను నిరూపిస్తామని చెప్పేవాడు. కానీ ఇటీవలే జరిగిన 'బంధూక్‌' కార్యక్రమంలో ఆయన మాట్లాడిన తీరు ఆశ్చర్యం కల్గించింది.

ఎక్కడా ఆంధ్ర నిర్మాతల గురించి కానీ దర్శకుల గురించి కానీ ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డాడు. క్లుప్తంగా మూడు ముక్కలు మాట్లాడి ముగించారు. అయితే వచ్చిన నాయకులంతా ఆవేశంగా.. ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌లో తెగ బిల్డింగ్‌లు కట్టేశారు. మా ఆస్తిని దోచుకున్నారంటూ విమర్శించారు.

ఆ తర్వాత కోదండరామ్‌ కౌంటర్‌ ఇస్తూ.... తెలంగాణ వారికి సినిమా గురించి పెద్దగా తెలీదు. ఆవేశంతో ఏవేవో మాట్లాడినవారు తెలంగాణ అంటే ఊరుకోను అంటూ చురక వేశారు. మనకు తెలీని విషయాలను నలుగురి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సినిమాల్లో ప్రావీణ్యం సంపాదించాలి. అప్పుడే మనం ముందుంటాం... అంటూ అప్పటివరకు ఎవరెన్ని తిట్టినా భరించాలని హితవు పలికాడు.

అందుకే.. ఇప్పుడు తెలంగాణా కళాకారులు అంతా కలిసి సమైక్యాంధ్ర కళాకారులతో కలిసి పనిచేసి వారి నుంచి పాఠాలు నేర్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీని శాసించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అంటే... తెలంగాణ సినిమా గట్టిపడ్డాక... సీమాంధ్ర నిర్మాత, నటులు, దర్శకులను తరిమివేయాలా... అనే విమర్శలు సైతం వినవస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

Show comments