అక్కినేనికి క్యాన్సర్.. 96 ఏళ్లు బ్రతుకుతా : అక్కినేని

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2013 (13:46 IST)
FILE
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఈరోజు మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తన దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని ఇటీవలే వైద్యులు తెలిపారని వెల్లడించారు. వృద్దాప్యంలో ఈ క్యాన్సర్ కణాలు నెమ్మదిగా పని చేస్తాయని వైద్యులు తెలిపారన్నారు.

అక్టోబర్ 8న తనకు కడుపునొప్పి వచ్చిందని దాంతో, కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని పేర్కొన్నారు. మనోబలం, అభిమానుల ఆశీర్వచనాల వల్లే ఆరోగ్యాన్ని అధిగమించానని.. మనోబలానికి మించి ఇన్నాళ్లు అభిమానుల ప్రోత్సాహం వల్లే సినిమాల్లో పనిచేస్తున్నానన్నారు.

74 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో పురస్కరాలు అందుకున్నానన్న అక్కినేని, సినిమా రంగంలో ఇన్నేళ్లు పనిచేయడమే ఓ రికార్డుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిమానం, ఆశీర్వచనాలు ఉంటే సెంచరీ కొడతానన్నారు. తన కుటుంబమంతా సీని రంగంలోనే సేవ చేస్తోందన్నారు. నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని 96 ఏళ్లు బ్రతుకుతానని మనోబలం చెబుతోంది. ప్రజలందరూ నన్న ఆశీర్వదించాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: ఏపీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి పోరాడుతుంది.. కవిత

పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై రిట్ పిటిషన్ కొట్టివేత: సుప్రీంకోర్టు

కిటికీ నుంచి దూరి 34 ఏళ్ల టెక్కీపై 18 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో నిప్పు

పబ్‌లో పనిచేసే ఫాతిమాను మాట్లాడట్లేదని చంపేశాడు..

కోడిగుడ్డు కూర దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ, ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

Show comments