Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ 'మనం' ఫస్ట్‌లుక్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2013 (10:43 IST)
FILE
ఏఎన్నార్ 90వ పుట్టినరోజు సందర్భంగా మనం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై నటసామ్రాట్‌, పద్మవిభూషణ్‌, డా. అక్కినేని నాగేశ్వరరావు, కింగ్‌ నాగార్జున, యువసామ్రాట్‌ నాగచైతన్య కలిసి నటిస్తున్న 'మనం' చిత్రం ఫస్ట్‌ లుక్‌, డిజిటల్‌ పోస్టర్‌ని సెప్టెంబర్‌ 20న డా. అక్కినేని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ చేయనున్నారు.

' ఇష్క్‌' వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కె. కుమార్‌ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'మనం' గురించి నిర్మాత నాగార్జున అక్కినేని మాట్లాడుతూ - ''నాన్న 90వ బర్త్‌డే సందర్భంగా 'మనం' ఫస్ట్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా వుంది. నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న 'మనం' హీరోగా నాకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో 'మనం' ఓ ప్రెస్టీజియస్‌ ఫిలిం అవుతుంది'' అన్నారు.

దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ - ''నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు, చైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈ చిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్‌ లుక్‌లో గెటప్స్‌ డిఫరెంట్‌గా వున్నట్లుగానే సినిమా చాలా డిఫరెంట్‌గా వుంటుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ కామెడీతో మంచి లవ్‌ఫీల్‌తో మంచి ఎమోషన్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

నాగేశ్వరరావుగారికి 90 ఏళ్ళు వచ్చినా సెట్‌లో అందర్నీ నవ్విస్తూ ప్లెజెంట్‌ ఎట్మాస్ఫియర్‌ని క్రియేట్‌ చేస్తారు. యూనిట్‌లో అందరికంటే ఎనర్జిటిక్‌గా వుంటూ అందర్నీ ఉత్సాహపరుస్తాను. నాగేశ్వరరావుగారిలాంటి లెజండ్‌తో వర్క్‌ చెయ్యడం ఎప్పటికీ మర్చిపోలేని గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. 'మనం' తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది'' అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వై.సుప్రియ మాట్లాడుతూ - ''అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో రేర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'మనం' అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అవుతుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ జరుగుతోంది. నవంబర్‌కల్లా నిర్మాణం పూర్తవుతుంది. ప్రేక్షకులకు, అక్కినేని వంశాభిమానులకు 'మనం' ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమ్‌ కె.కుమార్‌ ఈ సబ్జెక్ట్‌ని బాగా డీల్‌ చేస్తున్నారు'' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments