Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు అన్నయ్య కావాలట....!

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (11:30 IST)
FILE
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరో ఎవరంటే ఎన్టీఆర్ అనే చెబుతారు. వరుస సినిమాలు ఒప్పుకొని ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' సినిమాలు చేస్తున్నాడు. తర్వాత మిర్చి ఫేం కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. ఇంకా త్రివిక్రమ్‌తో ఒకటి, వంశీతో ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌కి అన్నయ్య కావాలట. ఎన్టీఆర్‌కు అన్నగా నటించేందుకు ఒక అన్నయ్య కావాలని కొరటాల శివ చెబుతున్నాడు. అయితే ఈ అన్నపాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా 'హడల్' పేరిట ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు.

ఈ సినిమా బ్రదర్ సెంటిమెంటుతో సాగుతుందట. దాంతో, ఇందులో కథానాయకుడి పాత్రతో పాటు, అతని అన్న పాత్రకు కూడా ప్రాధాన్యత వుంది. అందుకే, ఇప్పుడు ఆ అన్న పాత్రకు సూటయ్యే నటుడి కోసం అన్వేషణ జరుగుతోందని అంటున్నాయి సినీవర్గాలు. ఇలాంటి పాత్రలకు ఇప్పుడు జగపతిబాబు రెడీమెడ్‌గా ఉన్నాడు కాబట్టి, చివరికి అతనే ఎంపికయ్యే అవకాశం వుంది. కాగా, ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుందంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments