ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో 'బహుబలి' ఏమవుతుంది?

Webdunia
గురువారం, 20 జూన్ 2013 (15:09 IST)
FILE
రాజమౌళి చిత్రంలో ఏ హీరో చేసినా అది హిట్టే. కానీ అందులో దర్శకుడి ప్రతిభే కన్పిస్తుంది. సహజంగా హీరోకు పేరు రాదు. ప్రభాస్‌తో 'ఛత్రపతి' సినిమా చేశాక... ఆ చిత్రానికి ప్రభాసే కరెక్ట్‌ అని అందరూ అన్నారు. మరే హీరో చేసినా అంత ఎఫెక్ట్‌ వచ్చేది కాదు. కానీ ఆ తర్వాత ప్రభాస్‌కు మరే సినిమా అంత రేంజ్‌లో హిట్‌ కాలేదు. కథ కూడా ఆయనకు దొరకలేదు. రాజమౌళి చిత్రంలో నటిస్తే... ఆ తర్వాత హిట్‌ కోసం నానా తంటాలు పడాల్సింది హీరోనేననే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. దీనికి రామ్ చరణ్, ఎన్‌.టి.ఆర్, సునీల్‌ వంటివారు కూడా ఉదాహరణలే.

అయితే.. ప్రభాస్‌ కోసం మలిచిన బహుబలి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆ పాత్రకు ప్రతినాయకునిగా ఉండే పాత్ర రానా పోషిస్తున్నాడు. ఇద్దరిమధ్య పోరాట సన్నివేశాలు నువ్వా నేనా అనేట్లుగా ఉంటాయని చిత్ర యూనిట్‌ చెబుతుంది. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని తృణంగా పెట్టే బహుబలి పాత్ర ప్రభాస్‌ది.

అలాంటి మాట కోసం ప్రతినాయకుడు కాపు కోసం కూర్చునట్లు కూర్చుని... ప్రజల చేత ప్రాణాల్ని ఇచ్చేలా చేస్తాడట. చాలా ట్విస్టులతో కూడిన ఈ కథను రాజమౌళి ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్‌ అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: సంక్రాంతి రద్దీ.. అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయ్.. సమ్మె విరమణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు- విజయభాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ

అలాంటి కుట్రలకు బలి కావద్దు.. సంక్రాంతి సంబరాల్లో పవన్ పిలుపు

వరకట్నం వేధింపులు.. 11నెలల కుమారుడిని హత్య చేసి.. ఆపై ఆత్మహత్య

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 12 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

Show comments