Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజునాడు 'ఎవడు' ఫస్ట్‌లుక్‌

Webdunia
మంగళవారం, 26 మార్చి 2013 (21:49 IST)
WD
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుతోపాటు హోలీ పండుగ సందర్భంగా రామ్ చరణ్ తేజ, శ్రుతి హాసన్ నటించిన 'ఎవడు' ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. రచ్చ, నాయక్‌ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా శృతిహాసన్‌, అమిజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. మున్నా, బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 27న బుధవారంనాడు విడుదల చేస్తున్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, మా బేనర్‌లో రామ్‌ చరణ్‌ హీరోగా శృతిహాసన్‌, అమిజాక్సన్‌లు హీరోయిన్లు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిత్రం తెరకెక్కిస్తున్నాం. మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టినరోజునాడు ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ఇప్పటికే 90 శాతం టాకీతోపాటు రెండు పాటలు పూర్తయ్యాయి. ఓ యాక్షన్‌ సీన్‌ బ్యాలెన్స్‌ ఉంది. వీటితో మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన ఆడియోను మే 9న విడుదల చేస్తాం.

రామ్‌ప్రసాద్‌ అందించిన సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఉంటుంది. ఓ ప్రత్యేకమైన పాత్రలో అల్లు అర్జున్‌, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. పూర్తిగా వైవిధ్యమైన కథకి వినూత్నమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా వంశీ తీర్చిదిద్దాడు. ఇది టెక్నీషియన్స్‌ మూవీ. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటూనే అన్ని కమర్షియల్‌ హంగులతో సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని మెగా అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, బుధవారంనాడు ఫస్ట్‌లుక్‌ మాత్రమే విడుదల చేస్తున్నాం. మే 8న ఆడియోలో మెయిన్‌ లుక్‌ను విడుదల చేస్తాం. అభిమానుల్ని అలరించే చిత్రమవుతుందని అన్నారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments