Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్‌దునియా తెలుగు లేటెస్ట్ సినీ న్యూస్... ఎన్టీఆర్ ‌- బెల్లంకొండ సినిమా ప్రారంభం

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2013 (16:45 IST)
WD
జూనియర్ ఎన్టీఆర్‌తో బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోలో ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైంది. 'కందిరీగ' ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. ముహూర్తపు సన్నివేశం దేవుని పటాలపై తీశారు. ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. వినాయక్‌ కెమేరా స్విచ్చాన్‌ చేశారు. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ... మా లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఇదే ఎన్‌టిఆర్‌తో 'ఆది' అనే బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని అందించాం. మళ్ళీ ఎన్‌టిఆర్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మా బేనర్‌ ప్రతిష్టను పెంచేవిధంగా ఉంటుంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, కందిరీగ తర్వాత ఇదే బేనర్‌లో మరో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. కథ చెప్పగానే ఎన్‌టిఆర్‌ చాలా ఇన్‌స్పైర్‌ అయ్యారు. నా కథను నమ్మి వెంటనే ఓకే చేశారు. అతని నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. చిత్ర నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు మాట్లాడుతూ, మే 15న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని అన్నారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ, ఎన్‌టిఆర్‌ ఎనర్జీ, సమంత ఆకతాయితనాన్ని, బెల్లంకొండ భారీతనాన్ని చూపించే చిత్రమిది. దర్శకుడు కథ చెప్పినప్పుడు నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే అంత అద్భుతంగా కథ తయారుచేశాడు. హీరో కూడా ఈ కథ పట్ల ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. కందిరీగను మించి హిట్‌ అవుతుంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, కెమెరా: ఛోటాకె. నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మహేంద్రబాబు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments