Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' చిత్రంలో నేను లేను... సోనమ్ కపూర్

Webdunia
సోమవారం, 28 జనవరి 2013 (22:51 IST)
FILE
మహేష్ బాబు 'ఆగడ ు' చిత్రం తను చేయబోయే 4 చిత్రాల లిస్టులో లేదని బాలీవుడ్ సెక్సీక్వీన్ సోనమ్ కపూర్ చెప్పుకొచ్చింది. ఆ నాలుగు చిత్రాలు గురించి చెపుతూ... రంఝానా, భాగ్ మిల్కా భాగ్, యష్ రాజ్ ఫిలిమ్స్ చిత్రం, ఖూబ్ సూరత్ రీమేక్ చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించింది.

కాగా మహేష్ బాబు చిత్రం 'ఆగడు'లో మహేష్ సరసన అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ నటిస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ మాట్లాడుతూ... అసలు ఆగడు సినిమా గురించే తనకు తెలియదని, ఆ సినిమాలో నటిస్తానని సంతకం కూడా చేయలేదని అంది.

అలాంటప్పుడు ఆ చిత్రంలో నటించే అవకాశం ఇంకెక్కడిది అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కుండబద్ధలు కొడుతున్నట్లు చెప్పింది సోనమ్ కపూర్. మరి సోనమ్ నటిస్తుందంటూ పుకార్లు పుట్టించిందెవరో...? చూడాలి దర్శకనిర్మాతలు ఏమయినా చెపుతారేమో..?

ఇకపోతే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా 'ఆగడు' చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటి సోనమ్ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు నిన్నటివరకూ ఒకటే ప్రచారం జరిగింది. 'ఆగడు' చిత్రం దూకుడుకు సీక్వెల్‌గా రూపొందుతున్నట్టు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?