Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ నెత్తి మీద కొమ్ములు మొలిచాయేమోననే వారికోసమేనా....

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2012 (17:15 IST)
WD
చిరంజీవి ప్రతి మీటింగ్‌లోనూ కరెక్ట్‌గానే మాట్లాడుతాడని ఇండస్ట్రీ భావిస్తుంది. కానీ ఈమధ్య తనేం మాట్లాడుతున్నా... తాటాకులు కడుతున్నారంటూ ఆయన మీడియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం రాత్రి చిరంజీవి గబ్బర్‌సింగ్‌ ఆడియోలో చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పలురకాలుగా స్పందిస్తున్నారు. 'పంజా' ఆడియో వేడుకలో.. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ... తాను చెట్టుపేరు చెప్పుకుని రాలేదనీ... అంటూ కొత్త తరహాలో మాట్లాడారు. దానికి కౌంటర్‌గా చిరంజీవి నిన్న మాట్లాడాడని కామెంట్స్‌ విన్పిస్తున్నాయి.

చిరు మాట్లాడుతూ.. 35 సంవత్సరాల క్రితం సినిమాలో యాక్ట్‌ చెయ్యాలి అనే థాట్‌ నా మైండ్‌లో రాకపోయి వుంటే ఒక జన్మని వ్యర్థం చేసుకొని వుండేవాడ్నేమో. అలాగే మా కుటుంబం జన్మ కూడా వేస్ట్‌ చేసుకుని వుండేవాళ్ళమేమో అనిపిస్తుంది. ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఎంత గొప్పవారైనా సరే ఈ రకమైన అభిమానధనం సంపాదించడం అనేది పూర్వజన్మ సుకృతం.

మమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు మమ్మల్ని ఇంతవారిని చేశాయి. అందుకే నిలువెల్లా మీ పట్ల మాకు కృతజ్ఞత వుంటుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అహర్నిశలు ఆలోచిస్తుంటాము. ఇంతమంది ప్రేమను పొందడం, మీ గుండెల్లో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు. ఇది ఎన్నో జన్మల పుణ్యం. అలాంటి పుణ్యాన్ని కలిగిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు, అభిమానులకు మా మెగా కుటుంబం రుణపడి వుంటుంది' అన్నారు. అలా పవన్ కల్యాణ్ నెత్తి మీద కొమ్ములు మొలిచాయేమోనని భ్రమ పడే కొంతమంది భావాలను మెగాస్టార్ పటాపంచలు చేశారు. మెగా ఫ్యామిలీయా.. మజాకా...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments