Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్‌ 13న రవితేజ, గుణశేఖర్‌ల 'నిప్పు' ఆడియో

Webdunia
శనివారం, 12 నవంబరు 2011 (18:39 IST)
రవితేజ హీరోగా డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వైవియస్‌ చౌదరి బొమ్మరిల్లువారి పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'నిప్పు' సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 13న విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత వైవియస్‌ చౌదరి మాట్లాడూతూ - ''చూడాలని వుంది, ఒక్కడు సినిమాల ద్వారా మణిశర్మ కాంబినేషన్‌లో మ్యూజిక్‌ పరంగా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి మ్యూజిక్ పట్ల తనదొక డిఫరెంట్‌ టేస్ట్‌ అని ప్రూవ్‌ చేసుకున్నారు మా దర్శకులు గుణశేఖర్‌. అలాగే సీతారాముల కళ్యాణం చూతము రారండి నుండి సలీమ్‌ వరకు కీరవాణిగారు, రమణగోగుల, మణిశర్మ, చక్రి, సందీప్‌చౌతా వంటి విభిన్న సంగీత దర్శకుల నుండి మంచి సంగీతాన్ని రాబట్టుకొని మ్యూజిక్‌ పరంగా నా టేస్ట్‌ని ప్రూవ్‌ చేసుకున్నాను.

సంగీతం పట్ల మంచి అవగాహన కలిగిన మేమిద్దరం కలిసి చేస్తున్న 'నిప్పు' ఆడియోపై సినీ మార్కెట్‌లోనూ, శ్రోతల్లోనూ అంచనాలు భారీగా వుండడం సహజం. ఈమధ్య సినీ సంగీత ప్రపంచంలోకి చిచ్చరపిడుగులా ప్రవేశించి సాహిత్యాన్ని సంగీతపు హోరు డామినేట్‌ చెయ్యకుండా కొత్త రకమైన బ్లెండ్‌ మ్యూజిక్‌ చేస్తూ ఎయిట్‌ సీటర్‌ ఆటో నుండి పబ్‌లకు తిరిగే యూత్‌ వరకు తన సంగీతంతో అలరిస్తున్న థమన్‌ ఎస్‌.ఎస్‌.ని సంగీత దర్శకుడిగా ఎన్నుకోవడంతో మా సినిమా మ్యూజిక్‌ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి.

ఆ అంచనాల్ని అధిగమిస్తూ థమన్‌ ఎస్‌.ఎస్‌. 'కిక్‌' నుండి తనని రెగ్యులర్‌గా సపోర్ట్‌ చేస్తున్న రవితేజ సినిమా 'నిప్పు'ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. మా సినిమా మ్యూజిక్‌ సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న సినిమాల మ్యూజిక్‌ మధ్యలో నుంచి ఓ ప్రత్యేకత సంతరించుకున్న మ్యూజిక్‌గా ప్రేక్షకులకు, శ్రోతలకు రీచ్‌ అవుతుందన్న ప్రగాఢ నమ్మకం నాకు వుంది.

థమన్‌ అద్భుతంగా చేసిన ఆరు పాటల్లో మూడు పాటల్ని రాజుసుందరం, ఒక పాట గణేష్‌ తరుపాయ్‌, రెండు పాటల్ని బృంద నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నాం. థమన్‌ ఇచ్చిన సూపర్‌హిట్‌ సాంగ్స్‌ సెల్యులాయిడ్‌ మీద విజువల్‌గా కూడా అందర్నీ అలరిస్తాయి. డిసెంబర్‌ 13న 'నిప్పు' ఆడియోను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముందుగా ప్రకటించిన విధంగా జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

రవితేజ సరసన పొడుగుకాళ్ళ సుందరి దీక్షాసేథ్‌ కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో డ ా|| రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, ధ óర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌ దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, గణేష్‌ తరుపాయ్‌,
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments