Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు కంట్రోల్‌ చేసుకో: బాలయ్య వార్నింగ్ రాంచరణ్‌కా..?!!

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2011 (14:26 IST)
WD
" చరిత్ర తెలియని వారు తెలుగు సినిమాల గురించి చాలా చిన్నతనంగా మాట్లాడారు. ఒకాయన మాట్లాడుతూ.. తెలుగులో ఏమున్నాయండి.. సరైన సినిమాలు.. సరైన డైరెక్టర్లే లేరు... అంటూ ఏదోదే వాగాడు. నేను వెంటనే... చరిత్ర తెలియకుండా మాట్లాడకు. మాట్లాడేముందు నోరు కంట్రోల్‌ చేసుకో! మీకు తెలుగు దర్శకుల గురించి మాట్లాడే హక్కులేదు. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు తీసింది తెలుగువారు కాదా?" అంటూ ప్రశ్నించారు బాలయ్య.

బాలకృష్ణ ఇలా ఆవేశంగా మాట్లాడటంతో ఒక్కసారిగా అందరూ ఎలర్ట్‌ అయ్యారు. తెలుగు సినిమా గురించి ఎవరు? అలా మాట్లాడి ఉంటారని చర్చ జరిగింది. అయితే ఇది హీరో రామ్‌చరణ్‌ గురించని పుకార్లు లేచాయి. సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిరు ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.

అక్కడ అంతా మురుగదాస్‌ను, సూర్యను పొగడ్తల్తో ముంచెత్తారు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా ఇటువంటి పాత్రలు చేయడం సూర్యకే సాధ్యం. మాకు సాధ్యం కాదంటూనే... మురుగదాస్‌ వంటి గొప్ప దర్శకుడు తెలుగులో లేరా? అంటూ వ్యాఖ్యానించారు. దాంతో ఇప్పుడు బాలకృష్ణ 'నోర్ముయ్‌..' అంటూ సంబోధించింది వారినుద్దేశించేనని ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుండగా, బాలకృష్ణ తను శ్రీరాముడుగా నటించిన 'శ్రీరామరాజ్యం' చిత్రం ఆడియో సక్సెస్‌ మీట్‌లో సోమవారం రాత్రి ప్రసంగించారు. తెలుగు పేర్లు ఎక్కడా వినపడటంలేదు. బ్రాహ్మణి అంటే... భూమాత పేరు... ఇటువంటి పేర్లు నేటితరానికి తెలీదు. ఆ పేరు పెట్టడానికి బాగా తెలుసుకుని పెట్టాను అన్నారు. ఈ చిత్రంలో అందరూ బాగా నటించారనీ. పౌరాణిక పాత్రలు నాన్నగారి నుంచి పుణికిపుచ్చుకున్నానని అన్నారు. శ్రీరామరాజ్యం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments