లండన్ మ్యూజియంలో కరీనా మైనపు బొమ్మ!!

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2011 (12:54 IST)
రా, వన్ చిత్రం ద్వారా వెండితెరపై మరోమారు కనిపించనున్న బాలీవుడ్ అందాలబొమ్మ కరీనా కపూర్ మైనపు బొమ్మను లండన్‌లోని బ్లాక్‌పూల్ తీరంలో ఉన్న ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మేడమ్ టెస్సాడ్స్ మ్యూజియం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. 

ఈ మైనపు బొమ్మను ఈనెల 27వ తేదీన ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు మరో ఐదు మైనపు బొమ్మలను ప్రపంచంలోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు మ్యూజియం సిద్ధమవుతున్నట్టు మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు.

' రా.వన్' సినిమా విడుదలను పురస్కరించుకొని లండన్‌లోని బ్లాక్‌పూల్ తీరంలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్‌లో కరీనా మైనపు బొమ్మను ఆవిష్కరిస్తామని మ్యూజియం వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే తన మైనపు బొమ్మకు సంబంధించిన చిత్రాలను మ్యూజియం నిర్వాహకులు మెయిల్‌ చేశారని, రా.వన్ ప్రీమియర్ షో తిలకించేందుకు తాను ఈనెల 25న లండన్‌కు వెళ్తున్నానని, అక్కడ నుంచి మ్యూజియంకు చేరుకుని బొమ్మను ఆవిష్కరిస్తానని కరీనా చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments