Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తెలుగమ్మాయి"లో అన్నీ రేప్ సీన్సే: లక్ష్మీపార్వతి

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2011 (17:03 IST)
బయట రేప్‌లు జరిగినా, సినిమాల్లో రేప్‌ సీన్లు జుగుప్సాకరంగా చిత్రీకరించినా వాటిపై వ్యతిరేకంగా పోరాడడానికి మహిళా సంఘాలు రెడీగానే ఉంటాయి. అలాగే 'తెలుగమ్మాయి' చిత్రంలో రేప్‌ సీన్స్‌ చాలా ఉన్నాయి. వాటిని కుటుంబాలతో కలిసి చూడలేమని లక్ష్మీపార్వతి తేల్చిచెప్పారు.

సలోని కథానియకగా నటించిన ఈ చిత్రాన్ని హరిరామజోగయ్య సమర్పిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. అయితే ముందుగానే ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఓ షో వేసి కొంతమంది కాలేజీ విద్యార్థినులకు చూపించారు. వారు మాత్రం పెద్దగా స్పందిచలేదు. దాంతో రాజకీయపార్టీ మహిళా సంఘాలకు ఫిలిం ఛాంబర్‌లో స్పెషల్‌ షో వేశారు.

షో తర్వాత... ఒకరిద్దరు మహిళా ప్రతినిధులు తాము మాట్లాడేందుకు ఏమీ లేదనీ.. దర్శకత్వం బాగోలేదని హరిరామజోగయ్యతో అన్నారు. దాంతో ఆయన.. మిగిలిన కొద్దిమందితో మాట్లాడించారు. అందులో లక్ష్మీపార్వతి ఒకరు. ఆమె మాట్లాడుతూ... ఆడపిల్లలపై అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు చేసే రాక్షసులపై తెలుగమ్మాయి ఎలా చంపి బుద్ధి చెప్పిందేనని పాయింట్‌ చాలా బాగుంది. నిర్మాత దర్శకులు అభిరుచి మెచ్చదగింది.

కానీ దర్శకత్వంలో పర్‌ఫెక్షన్‌ లేదు. అలాగే రేప్‌సీన్స్‌ చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా తగ్గించుకోండని సూచించింది. ఆ తర్వాత మాట్లాడిన గంగాభవాని, సరోజనీదేవి, శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ, సినిమా బాగా తీశారని మహిళలు ఒక శక్తిగా ఎలా ఎదగాలో చెప్పారని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

Show comments