Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు అడిగితే చంపేస్తామన్న భాను, శింగనమల

Webdunia
సోమవారం, 17 జనవరి 2011 (17:09 IST)
సూరి హత్య కేసు టాలీవుడ్ అగ్రనిర్మాతల మెడకు చుట్టుకుంటోంది. ప్రముఖ ఫైనాన్సియర్ వైజయంతిరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదుతో దీనికి మరింత బలాన్నిస్తోంది. 2009లో అగ్రనిర్మాతగా పేరుగాంచిన శింగమనల రమేష్ ఓ సినిమాకోసం వైజయంతి రెడ్డి వద్ద ఓ భూమిని కుదవబెట్టి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వైజయంతి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ తర్వాత వైజయంతి తన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా అడిగితే... తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హత్య చేస్తామని సూరి హత్యకేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న భాను, నిర్మాత రమేష్ ఇద్దరూ బెదిరించారని వైజయంతి చెప్పుకొచ్చారు.

సూరి హత్యానంతరం వైజయంతి రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. మొత్తమ్మీద సూరి హత్య వ్యవహారం టాలీవుడ్‌లో అగ్రస్థానంలో వెలుగొందుతున్న నిర్మాతల మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

Show comments