Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య, తమన్నా జంటగా "వీడొక్కడే"

Webdunia
WD
బహుభాషా చిత్ర నిర్మాణ సంస్థగా ప్రసిద్ధి చెందిన "ఎవిఎం" ప్రొడక్షన్ రూపొందిస్తోన్న చిత్రాలపై సగటు సినిమా ప్రేక్షకుడికి ఆసక్తి మెండుగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దిశగా తమ సంస్థ చిత్రాలను నిర్మిస్తోందని ఎవిఎం అధినేతలంటున్నారు.

తాజాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఎవిఎం సంస్థ ఏకకాలంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదలయ్యే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో తమకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్న సూర్య, తమన్నా జంటగా "వీడొక్కడే" అనే చిత్రాన్ని కె.వి. ఆనంద్ దర్శకత్వంలో ఎవిఎం తెరకెక్కిస్తోంది.

" వీడొక్కడే" పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న ఈ చిత్ర విశేషాలకెళితే.. ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపే ఈ చిత్రమని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆఫ్రికాలో చిత్రీకరించామని వారు అన్నారు. హరీష్ జైరాజ్ బాణీలకు భువనచంద్ర రాసిని "నేనే నేనే" అనే గీతాన్ని దినేష్ నృత్య దర్శకత్వంలో సూర్య, తమన్నాలపై చిత్రీకరించారు.

అలాగే ఓ చిన్న ద్వీపం అయిన "టాన్ జానియా"లో హీరో, విలన్‌లపై ఓ భారీ భీకర యాక్షన్ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ నేతృత్వంలో చిత్రీకరించడం జరిగిందని నిర్మాతలు వెల్లడించారు.

ఇకపోతే... ఎవిఎం సంస్థ నుంచి వస్తోన్న 174వ చిత్రమైన "వీడొక్కడే" చిత్రానికి మాటలు.. శ్రీ రామకృష్ణ, సంగీతం.. హరీష్ జైరాజ్, నిర్మాతలు.. ఎం. శరవణన్, ఎం.ఎస్. గుహన్, అపర్ణాగుహన్, దర్శకత్వం... కె. వి. ఆనంద్.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments