Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'వందేమాతరం'

Webdunia
మంగళవారం, 22 జనవరి 2008 (17:56 IST)
WD
' వందేమాతరం... సుజలాం సుఫలాం మలయజ శీతలాం....' అన్న గీతం పాఠశాలల్లో ఒకనాడు అన్ని పాఠశాలల్లోనూ మారుమోగేది. కానీ నేడు కార్పొరేట్ కళాశాలల్లో చాలాచోట్ల వందేమాతరం ఆలాపన మచ్చుకైనా వినబడటం లేదు. 'వందేమాతరం' అన్న నినాదాన్ని వింటేనే స్వాతంత్ర్యయోధుల రక్తం పొంగుతుంది. అందులో అంత పవర్ ఉంది మరి. ఈ విషయాన్నే 'ఒక్కమగాడు'లో కూడా వృద్ధ సిమ్రాన్ పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు.

అసలు వందేమాతరం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.... మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వందేమాతరం అనబోతున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను ఎండగట్టేందుకు వందేమాతరం అనక తప్పదని ఆయన ఆలోచన కాబోలు. రోజురోజుకీ మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఎప్పుడు వచ్చినా ముందుగా అందుకు బీజం వేసే చిత్రం ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు.

చిరంజీవి నటించబోయే 149వ చిత్రం ఎలా ఉంటుందన్న నేపథ్యంలో... ఈ చిత్రం ఎలాంటి సన్నివేశాలతో రూపొందనుందన్న ఆసక్తి ముఖ్యంగా ఆయా పార్టీల రాజకీయ నేతలలో ఉంది. నిన్ననే తెలంగాణా ఎమ్మెల్యే నర్సింహయ్య ఓ విలేకరితో చిరు రాజకీయ ప్రవేశం గురించి వ్యాఖ్యానిస్తూ... ముందు ఆయన రాజకీయ ప్రవేశం సంగతి ఏమోగానీ, దానికి పునాది వేసే చిత్రం మటుకు తప్పనిసరిగా రాజకీయాలపై ఎక్కుపెట్టే అస్త్రం.. అన్నారు.

చిరంజీవి నటించబోయే 149వ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడనీ, ఆ తర్వాత పూరీజగన్నాథ్ అనీ ఇలా పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ ఛాన్స్ కృష్ణ వంశీని వరించిందనే వార్తలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి. దీనికీ ఓ లాజిక్కు ఉంది. గతంలో కృష్ణవంశీ ఓ పత్రికకు ఇంటర్య్యూ ఇస్తూ చిరంజీవిగారితో వందేమాతరం చిత్రం చేస్తానని చెప్పారు కూడా. దీనికితోడు ఫిలిం ఛాంబర్‌లో ఓ కొత్త బ్యానర్‌పై వందేమాతరం తో టైటిల్ రిజిస్టర్ చేసి ఉంది. అన్నీ సమకూరితే మార్చి 18న షూటింగ్ ప్రారంభం కావచ్చని ఫిలింనగర్ వాసుల కథనం.

గతంలో విప్లవాత్మకమైన చిత్రాలు తీసిన టి.కృష్ణ... సుమన్, విజయశాంతి కాంబినేషన్‌లో వందేమాతరం చిత్రాన్ని రూపొందించి అప్పట్లో సంచలనం సృష్టించారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చిరు వందేమాతరం ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

Show comments