మా ప్రేమ కథకు నాన్నే నిర్మాతగా ఉండాలి: శ్రీజ

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2007 (14:58 IST)
మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌ల వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అయితే.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో మాత్రం.. శ్రీజ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.

తాజాగా.. తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్‌ చిత్రరంగంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంటోంది. ఒకవేళ తమ ప్రేమ కథ తెరకెక్కితే.. ఆ చిత్రానికి తన తనండ్రి మెగాస్టారే నిర్మాతగా ఉండాలని శ్రీజ భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా.. ఈ చిత్రంలో తన భర్త శిరీష్‌తో కలసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు శ్రీజ న్యూఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించింది.

మా నాన్నకు ఒక్క విషయం చెపుతున్నా.. నేను సురక్షితమైన హస్తాల్లోనే ఉన్నాట్టు స్పష్టం చేసింది. శ్రీజ-శిరీష్ దంపతులకు పోలీసు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన మరుక్షణమే.. శ్రీజ తమ ప్రేమ వ్యవహారంపై స్పందించారు. తమ ప్రేమ వివాహానికి తండ్రి చిరంజీవి సమ్మతించాలని విజ్ఞప్తి చేసింది. శిరీష్‌తో నాకున్న స్నేహం పట్ల డాడ్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి లోనుచేసింది.

మా స్నేహాన్ని వదులుకోవాలని ఎంతో ఒత్తిడి తెచ్చారు. గృహనిర్భంధంలో ఉంచారు. మా కుటుంబంలోని ఎవరూ కూడా నాకు మద్దతు ఇవ్వలేదు. చివరికి మా అమ్మ కూడా అని శ్రీజ వ్యాఖ్యానించింది. నన్ను అర్థం చేసుకోవడంలో మా నాన్న విఫలమయ్యారు. నా నిజాయితీని, నమ్మకాన్ని నిరూపించుకునేందుకు కొంత సమయం నాకు కావాలని శ్రీజ అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఆ తప్పులు చేసా, ALS వ్యాధితో మరణిస్తున్నా, కుమార్తెలకు హాలీవుడ్ నటుడు ఎరిక్ కన్నీటి లేఖ

రూ.20 నుంచి రూ.40కి పెరిగిన మద్యం ధరలు.. ఎక్కడంటే..?

స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటో డ్రైవర్ దిగాడు, పిల్లాడు యాక్సలరేటర్ తొక్కాడు, వామ్మో... వీడియో

ప్యూర్ ఎనర్జీకి చారిత్రాత్మక న్యాయ విజయం

ఏపీ లిక్కర్ స్కామ్ : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

Show comments