Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ముమైత్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2007 (12:50 IST)
' పోకిరి' చిత్రం ద్వారా ఐటంగర్ల్‌‌గా తెలుగు చిత్ర రంగం ప్రవేశం చేసిన ముమైత్ ఖాన్.. చిన్నగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అనే పాటతో యువతను ఉర్రూతలూగించిన ముమైత్.. ఆ తర్వాత 'ఆపరేషన్ దుర్యోధన', 'ఎవడైతే నాకేంటి' చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.

దీంతో ఒక్కసారిగా ఆమె హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. త్వరలో విడుదల కానున్న 'మైసమ్మ ఐపీఎస్' చిత్రంలో ముమైత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకమునుపే ఆమె మరో చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు ఎంపికైంది. 'కబడ్డి కబడ్డి' చిత్ర ఫేం వెంకీ దర్శకత్వం వహించే 'మంగతయారు టిఫిన్ సెంటర్' చిత్రంలో ముమైత్ కథానాయిక పాత్రను పోషించనుంది.

ఈనెల 21వ తేదీనుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని కె.పైడిబాబు నిర్మిస్తుండగా, ఎంఎం.శ్రీలేఖ సంగీత బాణీలను సమకూర్చనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

Show comments