Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిషెడ్యూల్‌ పూర్తయిన "నితిన్" సినిమా

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2007 (13:47 IST)
నితిన్, మమతా మోహన్‌దాస్, సింధుతులాని, శశాంక్ ప్రధాన తారాగణంగా, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న నితిన్ చిత్రం తొలి షెడ్యూల్ గురువారంతో పూర్తవుతుంది. ఈ విషయాన్ని నానక్‌రామ్ గూడాలోని సిలీవిలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నానాక్‌రామ్ గూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 3 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభమయిందని చెప్పారు. నితిన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు. "సామాన్యుడు" చిత్రం తర్వాత దర్శకుడు చాలా కసితో చేస్తున్న ఈ చిత్రం అందరికీ పేరు తెస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రవి. సి. కుమార్ విలేకరులతో మాట్లాడుతూ... కథానుగుణంగా బడ్జెట్‌కు పరిమితం లేకుండా, వర్కింగ్ డేస్ నిబంధనలు లేకుండా నిర్మాత చక్కని సహకారం అందించారని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంశాలతో చక్కటి మెసేజ్‌కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు.

హీరోయిన్ మమతామోహన్ మాట్లాడుతూ... ఇందులో తాను రెండు పాటలు పాడుతున్నాననీ, "యమదొంగ" తర్వాత అంతటి చక్కని పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నానని తెలిపారు.

" తాను మమతా, నితిన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని, తనదీ గుర్తింపు కలిగే పాత్రేనని" సింధు తులాని అన్నారు. శశాంక్ మాట్లాడుతూ... నితిన్‌తో "సై" తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇటీవలే "హ్యాపీడేస్"లో కూడా చేశానని చెప్పారు. ఆ చిత్రానికి పనిచేసిన విజయ్. సి కుమార్‌తో పనిచేయడం ఉత్సాహంగా ఉందని తెలిపారు.

ఈ నెలాఖరులో మలి షెడ్యూల్ జరుగనుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వి. సురేష్ రెడ్డి తెలిపారు. ఇంకా అశుతోష్‌రాణా. ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ళభరణి, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్‌: వెంకటేశ్వరరావు, నిర్మాత: వెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రవి సి.కుమార్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

Show comments