తరుణ్ సరసన 'పోకిరి' భామ

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2007 (11:40 IST)
FileFILE
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు వెల్లువలా వస్తున్న హీరోయిన్లలో ఇలియానా ఒకరు. అయితే.. వచ్చిన అవకాశాలను అంగీకరించేందుకు ఆమె ససేమిరా అనండంతో తెలుగుకు స్వస్తి పలికినట్టేనని కొందరు భావించారు. దీంతో ఇలియానా కల్పించుకుని, తనకు ఓ ఇమేజ్‌ను, గుర్తింపును ఇచ్చిన తెలుగు పరిశ్రమను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో యువహీరో తరుణ్‌తో ఓ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించింది. శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మరో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం కథ నచ్చడంతో యువ హీరోతో సీనియర్ నటుడు నటించేందుకు అంగీకరించారని వినికిడి.

అలాగే.. ఇలియానా కూడా చిత్ర కథ నచ్చడంతో అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. లోగడ విజయభాస్కర్-తరుణ్ కాంబినేషన్‌లో 'నువ్వే నువ్వే' చిత్రం వచ్చింది. తాజాగా నిర్మించనున్న చిత్రం షూటింగ్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన

విదేశీ పర్యటనకు పట్టుబట్టిన భార్య.. నో చెప్పిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య

యాచకుని వద్ద లక్షలాది రూపాయలు.. పెట్టెలో నోట్లకట్టలు.. బ్యాంకు ఖాతాలో..?

Madam Zeher: ఢిల్లీలో లేడీ డాన్ అరెస్ట్.. పగలు ఆ పని.. రాత్రి వేరే పని

Crime Rate: ఏపీలో నేరాల రేటు ఆరు శాతం తగ్గింది.. హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

Show comments