Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున కొవ్వొత్తులను వాడకూడదు.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2015 (17:43 IST)
దీపావళి రోజున కొవ్వొత్తులను వాడకూడదని పండితులు అంటున్నారు. ఇవి నెగెటివ్ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని.. దుష్టశక్తులను ఆకర్షిస్తుందని పండితులు అంటున్నారు. మార్కెట్లో దీపావళికి ప్రత్యేకంగా అమ్మే మైనపు వత్తుల్ని దీపాలుగా వెలిగించకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దీపావళి రోజున ఎర్రటి ప్రమిదలు.. అదీ మట్టి ప్రమిదలను వాడటం ద్వారా దైవశక్తులను ఆకర్షించినవారవుతారని వారు సూచిస్తున్నారు. దీపం శుభాలను సూచిస్తే.. కొవ్వొత్తి శోకాన్ని సూచిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. 
 
అలాగే నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం ద్వారా వాతావరణంలో ఉన్న క్రిములను నశింపజేస్తాయి. ఈ దీపపు కాంతి కంటికి ఎంతో మేలు చేస్తాయి. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. అందుకే దీపావళి రోజున నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలని.. నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి చలికాలంలో వస్తుంది.. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. 
 
చల్లని వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయని, తద్వారా శ్వాసకు సంబంధించిన రోగాలు వస్తాయి. ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుందని.. ఆ వత్తులు కాలడం ద్వారా వచ్చే వాసనను పీల్చడం ద్వారా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. 
 
మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె పూర్వ జన్మల పాపపుణ్యాలను సూచిస్తుంది. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు. దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది దీపం వెనుకున్న పరమార్థమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments