Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌ర‌కాసురుడికీ ఫ్యాన్స్... దీపావ‌ళిపై నిర‌స‌న‌, కృష్ణుడిపై ఫైర్, కలియుగం కట్టలు తెంచుకుంటుందా...?!!

భ‌ద్రాచ‌లం : హీరోకే కాదు... విల‌న్‌కు కూడా ఫ్యాన్స్ ఉంటారు. దేవుడినే కాదు... రాక్ష‌సుల‌నూ పూజించేవాళ్ళుంటారు. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే ఈ పోస్ట‌ర్. ద్ర‌విడ మ‌హారాజ న‌ర‌క వీర జ‌యంతి అంటూ... భద్రాచల రామక్షేత్రంలో నరకాసుర సంతతి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (13:46 IST)
భ‌ద్రాచ‌లం : హీరోకే కాదు... విల‌న్‌కు కూడా ఫ్యాన్స్ ఉంటారు. దేవుడినే కాదు... రాక్ష‌సుల‌నూ పూజించేవాళ్ళుంటారు. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే ఈ పోస్ట‌ర్. ద్ర‌విడ మ‌హారాజ న‌ర‌క వీర జ‌యంతి అంటూ... భద్రాచల రామక్షేత్రంలో నరకాసుర సంతతి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. నాడు బ్రాహ్మ‌ణ మూక కుతంత్రాల‌పై తిరుగుబాటు చేసిన ధ‌ర్మ ప‌రిపాల‌కుడు, ఆర్త‌జ‌న ప‌క్ష‌పాతి న‌ర‌కాసురుడ‌ని ఇందులో శ్లాఘించారు. 
 
అమ్మ‌ల‌పై ఆయుధాల‌ను ఎక్కుపెట్ట‌ని ధ‌ర్మ నిర‌తుడు, గొప్ప శాంతి కాముకుడు, న‌ర‌క వీర మ‌హారాజ‌ని కొనియాడారు. ఇంత‌టి రాజును ఆర్య, ఇరానియ‌న్ రాజైన కృష్ణుడు కుటిల నీతితో ధ‌ర్మాన్ని విడిచి త‌ల్లి లాంటి స‌త్య‌భామ‌ను ఎర‌వేసి నరకాసురుడిని హత్య చేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌ర‌క వీర మ‌హారాజుని హ‌త్య చేసిన రోజును నిర‌సిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నాడు న‌ర‌క వీరుడు, బ‌లి చ‌క్ర‌వ‌ర్తులు నేడు ద‌భోల్క‌ర్, గోవింద్ ప‌న్సారేలను కూడా ఇలాగే బ‌లి చేశార‌ని, య‌దార్ధ వాది ఏ కాలంలోనైనా లోక విరోధి అని పేర్కొన్నారు.
 
రాక్షసులను కీర్తించడం వంటి చర్యలను చూస్తుంటే కలియుగం కట్టలు తెంచుకుని అంతానికి పరుగులు పెడుతుందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

తర్వాతి కథనం
Show comments