Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే?

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (20:20 IST)
దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పాలంటే.. ఉదయాన్నే లేచి స్నానమాచరించి బంధువులకు, సన్నిహితులకు పిండివంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలు ఇవ్వాలి. దీపావళి నాడు ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం వనగూరుతుందని విశ్వాసం. బాకీల నుండి విముక్తి పొందాలంటే.. ఈ పండుగ నాడు శ్రీలక్ష్మీదేవికి నిత్యపూజలు లేదా శ్రీ ధనలక్ష్మీ నిత్య పూజలు చేయవలసి వుంటుంది.
 
ఈ రోజు లక్ష్మీదేవి కుబేర వ్రతాన్ని ఆచరించి సుమంగళి స్త్రీలకు ఇంటికి విచ్చేసే వారికి పసుపు, కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేయాలి. ఇలా చేయడం వలన సకల సంపదలు, సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇక.. దీపావళి రోజు ఆలయాల్లో జరిపే శ్రీ మహాలక్ష్మీ కోటి కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం. 
 
వెండితో తయారుచేసిన దీపాలలో ఆవునెయ్యి వేసి తామరవత్తులతో దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇదే రోజున సాయంత్రం ఆరుగంటల సమయంలో నుదుట కుంకుమను దిద్దుకుని, పూజగదిలో రెండు పంచముఖ దీపపు సెమ్మెలలో తామర వత్తులను అమర్చి వెలిగించాలి. తరువాత ఇంటి నిండా దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మీ దేవ్వ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని స్మరించడం వలన ఆ గృహం ఎల్లప్పుడూ ఆనందాలతో వెల్లువిరుస్తుందని విశ్వాసం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments