దీపావళి అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి?

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (22:31 IST)
దీపావళి అక్టోబరు 28. ఈ పండుగ రోజున వేకువ జామున అభ్యంగన స్నానం చేయాలి. ఒంటినిండా శుభ్రంగా నూనెను పట్టించి, దానిని శెనగపిండితో రుద్దుకుని.. పావు గంట అలానే వుండి.. తలంటు స్నానం చేయాలి. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే శరీరభాగాలు మొద్దుబారిపోకుండా వుండేందుకు.. నూనెను పట్టించి.. అభ్యంగన స్నానం చేస్తారు. 
 
దీపావళి అభ్యంగనం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా దీపావళి రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెప్తున్నారు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శెనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. అందుకే దీపావళి రోజున నూనెతో శరీరానికి మర్దన చేసి అభ్యంగన స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే నరకచతుర్దశి నాటి నుంచే, ఇళ్లల్లో, ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments