Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సత్యభామ" నరకాసురుని వధించుట

Webdunia
ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పరిగణిస్తారు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు సాధు జనాలను పీడిస్తూ... దేవతలను హింసించే వాడు. ఇతని క్రూర చర్యలతో ముల్లోకాలను అట్టుడికిపోయాయి.

ఈ నరకాసురుడు కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు. ఈ సందర్భంలో జన్మించడం ద్వారా రాక్షసుడిగా నరకాసురుడనే పేరున పిలువబడతాడు. రాక్షసుడైన తన కుమారుడు లోకానికి ఎలాంటి కీడు కల్గినా మహావిష్ణువు వధించకూడదని, తల్లియైన తన చేతిలోనే నరకాసురుడు మరణించాలని భూదేవి వరం పొందుతుంది. ఫలితంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

అప్పటికే నరకాసురుని దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతుండగా, అతని అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో కృష్ణునికి, నరకాసురునికి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో శ్రీకృష్ణుడు నరకుని అస్త్రాలకు మూర్చిల్లుతాడు. అనంతరం భూదేవి అంశమైన సత్యభామ తన అస్త్రంతో నరకాసురుడిని వధించడం జరుగుతుంది.

ఈ విధంగా... భూదేవిగా తను పొందిన వరం సఫలీకృతం కావడంతో పాటు, తన పుత్రుడైన నరకాసురుని పేరు కలకాలం ఈ లోకంలో నిలిచి ఉండేలా చేయమని భూదేవి అంశమైన సత్యభామ కృష్ణునిని ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థనకు చెవొగ్గిన శ్రీకృష్ణుడు ఆ రోజును నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరమిస్తాడు.

ఇలా నరకాసురుని వధించి అతని చెరలో బంధీలైన వేలకొలమంది రాజకన్యలను, సాధుజనులను శ్రీకృష్ణుడు విడిపించి, ధర్మాన్ని సంరక్షించాడు.

దీని ద్వారా నరకాసుర వధ జరిగిన మరుసటి రోజు... అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

11-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అంచనాలను మించుతాయి...

09-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

Guru Purnima 2025: గురు పౌర్ణమి- ఇంద్రయోగం.. మిథునం- కన్యాతో పాటు ఆ రాశులకు శుభం

Show comments