ప్రపంచ నవ్వుల దినోత్సవం: నవ్వలేనివాడు అనారోగ్యవంతుడు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (23:22 IST)
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు. 1998 నుండి జరుపుకుంటున్నాం. ప్రపంచ నవ్వుల దినోత్సవం అనేది నవ్వు, దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి జరుపుకునే వార్షిక కార్యక్రమం. రోజుకు కనీసం 30 నిమిషాలైనా మనసారా నవ్వకపోతే అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఎందుకంటే నవ్వులో పాజిటివ్ భావాలతో పాటు హీలింగ్ ప్రక్రియ కూడా ఉంది. డాక్టర్ మదన్ కటారియా లాఫింగ్ క్లబ్ స్థాపకునిగా మనదేశంలో 1300 క్లబ్బులు, విదేశాల్లో 700 పైగా నెలకొల్పి 'అంతా నవ్వండి, నవ్వించండి' అని ప్రచారం చేస్తున్నారు. నవ్వుకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన కటారియా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
హాస్యం మన సమస్యల్ని దూరం చేస్తుంది. హాయిగా గాఢమైన నిద్ర పడుతుంది. అమెరికాలోని 'సండే రివ్యూ' పత్రికా సంపాదకుడు నార్మెన్ క్యూసిన్స్ బాగా జబ్బుపడితే... అతను ఇక కొన్నిరోజులే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా అతనికి లాఫింగ్ థెరపీ చేశారు. అతను ఓ పది నిమిషాలపాటు కడుపుబ్బ నవ్వేవిధంగా అనేక కామిక్స్ చూపించారు. ఈ ప్రక్రియను కొన్నాళ్లు అలానే సాగించారు. అంతే ఆయన జీవితకాలం పెరిగింది.
 
కనుక నవ్వటం అనేది ఓ ఆరోగ్య సూత్రం. అందుకని ఈ ప్రపంచ హాస్య దినోత్సవం రోజునుంచి మనమందరం తనివితీరా నవ్వుకుందాం. హ.. హ్హ... హ్హ్హ.... గట్టిగా నవ్వండి... కడుపుబ్బ నవ్వండి. నవ్వించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments