Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లో జగన్ గెలవాలంటే ఏం చేయాలి? పవన్, ఎన్టీఆర్ రంగంలోకి దిగితే?

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (16:44 IST)
2014 సార్వత్రిక ఎన్నికలు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చిన నేపథ్యంలో.. 2019 ఎన్నికలపై దృష్టిపెట్టారు. తెలుగుదేశం పార్టీకి వలసలు వెల్లువెత్తిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కూటమి అధికారంలో ఇప్పటికే రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనైనా జగన్ అధికారంలోకి రావాలంటే.. మైసూరా రెడ్డి చెప్పిన జోస్యం ఫలించాలి. అదేమిటంటే..? వైసీపీకి రాజీనామా చేసేసిన సీనియర్ నేత మైసూరా రెడ్డి అధికారం అందడం మాత్రం అసాధ్యమని తేల్చేశారు. 
 
ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమైతే జగన్‌కు కలిసొస్తుందని చెప్తున్నారు. అలాగే జగన్ రాజకీయంగా ఎదగాలి. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా జగన్ అధికారంలోకి రాలేరని మైసూరా అంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సీఎం కావడానికి అడ్డుపడొచ్చని.. చంద్రబాబు హామీలు నెరవేర్చలేకపోయినా.. ఎన్నికల సమయానికి ఎన్టీఆర్‌ని రంగంలోకి దించితే మాత్రం జగన్‌‌కు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
ఇకపోతే.. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని, జగన్ సీఎం కావడం ఖాయమని సర్వేలు తేల్చాయి. కానీ ఒక్కసారిగా పవన్ కల్యాణ్ రాకతో పూర్తిగా సర్వేలు తారుమారయ్యాయి. పవన్ పార్టీ పెట్టడం, టీడీపీ బీజేపీ కూటములు కావడం జరిగిపోయాయి. మరి 2019 ఎన్నికలు జగన్‌కు ఏమేరకు లాభిస్తాయో వేచి చూడాలి.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments