Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు వేరొక మహిళతో అక్రమ సంబంధం.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త వేరొకరితో తిరుగుతున్నాడనే అనుమానంతో ఆమె భర్త లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గుర్ల

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (11:51 IST)
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త వేరొకరితో తిరుగుతున్నాడనే అనుమానంతో ఆమె భర్త లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గుర్ల మండలం గరిడ గ్రామానికి చెందిన విక్రమ్ శ్రీను కొంతకాలంగా అనకాపల్లిలో తాపీమేస్త్రీగా పవిచేస్తూ పూడిమడక రోడ్డులోని సున్నం బట్టీల సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చి ఐదో తేదీన స్వగ్రామానికి చెందిన బాల వెంకటరావు కుమార్తె శైలజ (20)తో వివాహమైంది. అనంతరం భార్యను తీసుకువచ్చి కాపురం మొదలుపెట్టాడు.
 
అయితే శ్రీనుకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. రాత్రివేళల్లో ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడని శైలజ గరిడలో ఉంటున్న తన సోదరికి చెప్పేదని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా శైలజ వద్దని చెప్పినప్పటికీ ఆయన బయటకు వెళ్లాడని పట్టణ సీఐ సంపతిరావు విద్యాసాగర్‌ తెలిపారు. 
 
బయటకు వెళ్లిన శ్రీను రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తెరిచేసరికి శైలజ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శైలజ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గరిడలో నివాసముంటున్న మామ వెంకటరావుకు ఫోన్‌లో విక్రమ్‌ శ్రీను తెలిపారన్నారు. శైలజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విక్రమ్ శ్రీనును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments