Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఏ(ఏపి) రాష్ట్రానికి రాదు... సాధించలేకపోతే తెదేపా గల్లంతేనా...?!!

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (14:56 IST)
తెలంగాణ సెంటిమెంటు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అటు తెలంగాణ దేశంలో ఆర్థికంగా మూడో స్థానాన్ని ఆక్రమించి అభివృద్ధిలో దూసుకు వెళుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ స్థానం 20వ స్థానానికి దిగువన పడిపోయి విలవిలలాడుతోంది. ఈ స్థితిలో ప్రత్యేక హోదాతో ఏపీని కేంద్రం ఆదుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఏపీయే కాదు... దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితే లేదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించేశారు.
 
రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది అశనిపాతమే. పైగా రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన నిధులను విదల్చడంలోనూ మూర ముందుకు బార వెనక్కి అన్న చందంగా ఏమాత్రం నిధులను ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా రానట్లయితే 32 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఓ కలగానే మిగిలిపోక తప్పదు. రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములను పణంగా పెట్టేశారు. కానీ కేంద్రం మాత్రం ఏపీకి సహాయం చేసే దిశగా అడుగులు వేయడం లేదు.
 
ఈ స్థితి ఇలాగే కొనసాగి, ప్రత్యేక హోదా సాధించలేకపోతే తెదేపాకు మున్ముందు కష్టాలు తప్పవు. విపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి తలెత్తే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక ఫలితాలను ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు ఇప్పటికే వినబడుతున్నాయి. మరోవైపు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏపీలో ఆయా పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. 
 
ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏ క్షణమైనా రోడ్డుపైకి వచ్చేసి దీక్ష అని చెప్పేసినా ఆశ్చర్యం లేదు. ఇలా ప్రతి ఒక్క పార్టీ ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితి ఊపందుకుంటే 2019 నాటికి భాజపా-తెదేపాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments