Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభన్ బాబు - జయలలిత మరణాలు ఒకే రీతిలో జరిగాయా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న చర్చను చూస్తుంటే గతంలో ఆమె పెళ్లాడినట్లు చెప్పుకుంటున్న శోభన్ బాబు మరణంపై నటుడు బాబూ మోహన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకువస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (19:35 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న చర్చను చూస్తుంటే గతంలో ఆమె పెళ్లాడినట్లు చెప్పుకుంటున్న శోభన్ బాబు మరణంపై నటుడు బాబూ మోహన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకువస్తున్నాయి. శోభన్ బాబు ఆయన కుటుంబ సభ్యుల కారణంగా చనిపోయారంటూ బాబూ మోహన్ వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత క్షమాపణలు కోరడం తెలిసిందే. ఇప్పుడు శోభన్ బాబు మాదిరిగా జయలలితను ఆమె చుట్టుపక్కల వున్నవారే మట్టుబెట్టారంటూ తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది.
 
జయలలిత మృతిపై అన్నాడీఎంకే నేత పాండ్యన్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయెస్‌గార్డెన్‌లో జయలలితతో కొందరు ఘర్షణ పడ్డారని, ఆమెను ఎవరో తోసేయడంతో కిందపడిపోయారని అన్నారు. ఆర్డినెన్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య వాదన జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 22వ తేదీన అమ్మను కిందకు తోసేయడంతోనే ఆమె తీవ్ర గాయాలపాలయ్యారనీ, దాంతో ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి కూడా వివరాలు బయటికి పొక్కలేదన్నారు. 
 
అందుచేత జయలలిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పాండ్యన్‌ డిమాండ్ చేశారు. శశికళకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అర్హత లేదని ఆయన అన్నారు. కాగా పాండ్యన్‌ చేసిన ఆరోపణలను శశికళ వర్గీయులు కొట్టిపారేశారు. అమ్మను హత్య చేసిన చందంగా పాండ్యన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని శశి వర్గం అంటోంది. 
 
ఇదిలా ఉంటే.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలపై ఆమెకు చికిత్స అందించిన లండన్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు రిచర్డ్ బాలే స్పందించారు. జయ మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని, శ్వాస సంబంధమైన ఇబ్బందులు, అవయవాలు దెబ్బతినడం వల్లే ఆమె మృతి చెందారని వివరించారు. ఆమెను బతికించేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జయలలితకు అందించిన చికిత్స పట్ల వైద్యుల సమాధానాలకు ఏమాత్రం పొంతన లేదని వార్తలొస్తున్నాయి. మొత్తమ్మీద జయలలిత మరణంపై జరుగుతున్న చర్చ మరోసారి శోభన్ బాబును గుర్తుకు తెచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments