Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2,50,000 దాటి ఇంట్లో డబ్బు ఉంటే గుండెల్లో గుబులే... ఆపై ఒక్క పైసా డిపాజిట్ చేసినా...

కోట్లకు కోట్లు పోగేసుకుని నేల మాళిగల్లో దాచేసుకున్న నల్ల కుబేరుల సంగతేమోగానీ... ఎన్నో ఏళ్లుగా డబ్బును దాచుకుంటూ, ఏదో ఇల్లో, పొలమో కొందామని డబ్బులను దాచుకున్నవారు నిజంగా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం విధించిన రూ. 2.5 లక్షల పరిమితిని మించి

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (19:34 IST)
కోట్లకు కోట్లు పోగేసుకుని నేల మాళిగల్లో దాచేసుకున్న నల్ల కుబేరుల సంగతేమోగానీ... ఎన్నో ఏళ్లుగా డబ్బును దాచుకుంటూ, ఏదో ఇల్లో, పొలమో కొందామని డబ్బులను దాచుకున్నవారు నిజంగా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం విధించిన రూ. 2.5 లక్షల పరిమితిని మించి డబ్బు డిపాజిట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్న సమాచారం వస్తోంది. చాలామంది ఇళ్లు, పొలాలు కొనేందుకు రూ. 10 నుంచి రూ. 50 లక్షల వరకూ ఇళ్లలో దాచుకున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. 
 
అలాంటివారు ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు. నిజానికి ఇది ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ వ్యత్యాసం కారణంగానే. ప్రభుత్వ విలువ రూ. 5 లక్షలు ఉంటే మార్కెట్ విలువ రూ. 50 లక్షలు ఉన్నప్పుడు, భూమిని అమ్మిన వ్యక్తి కేవలం రూ. 5 లక్షలకే స్టాంపు పేపర్లు తీసుకుని భూమిని కొనుగోలు చేయడం మామూలుగా చూస్తుంటాం. అలాంటప్పుడు మిగిలిన రూ. 45 లక్షలు నల్లధనంగా మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటివారు ఎక్కువగా ప్రధానమంత్రి మోదీ నిర్ణయంతో ఇరుక్కుపోయినట్లయింది. 
 
ఎక్కువగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన ప్రజలు ఇలాంటి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఐతే ఇలా ఇరుక్కుపోయిన డబ్బును కూడా కుటుంబ సభ్యులు తమతమ ఖాతాల ద్వారా డిపాజిట్ చేసుకునే వీలుంటుంది. ఐతే ఆ డబ్బు ఎలా వచ్చిందన్నది లెక్కలు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే మధ్యతరగతి, సామాన్య ప్రజలు కొంత అయోమయంలో పడిపోయారు. దీనిపై ప్రభుత్వం, ఆదాయపు పన్ను అధికారులు మరికాస్త స్పష్టతనిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌

రాజమౌళి స్పందన గురించి గేమ్ చేంజ‌ర్‌ చిత్ర యూనిట్ ఆసక్తి

నాని సినిమా హిట్ 3 కాశ్మీర్ లో షూటింగ్ - సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ మ్రుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments