Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రన్న చేతిలో రోజమ్మ భవిష్యత్తు: సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారా?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2015 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. కాల్ మనీ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే రోజమ్మపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు స్పీకర్ కోడెలను విజ్ఞప్తి చేశారు. 
 
రోజాపై సస్పెన్షన్‌ వేటును ఈ అసెంబ్లీ సెషన్స్ వరకు పరిమితం చేయాలని విష్ణు కుమార్ రాజు కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రోజా సస్పెన్షన్‌పై స్పీకర్ కోడెల ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని.. ఇకపై రోజాపై సస్పెన్షన్‌‌కు సంబంధించి అసెంబ్లీ లేదా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి  ఉంటుందని వ్యాఖ్యానించారు. 
 
యనమల మాటల్ని బట్టి చూస్తే.. ప్రభుత్వమంటే.. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే అధికారం ఉన్నట్లు తెలుస్తోంది. రోజా సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించి.. ఆ ఓటింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేస్తే రోజమ్మకు ఊరట లభిస్తుంది.

ఇప్పటికే అసెంబ్లీ టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా సస్పెన్షన్ నుంచి రెండుసార్లు ఎస్కేప్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా సస్పెన్షన్‌కు గురైంది. తద్వారా రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటే.. అది చంద్రబాబు మనస్సు మారితేనే సాధ్యమవుతుందా?

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments