Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి రేవంత్ రెడ్డి ఔట్.. ఎందుకు?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (19:30 IST)
తమకు తాము ఎక్కువ ఊహించుకుని భంగపడటం అనేది రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఆ లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా ఎదిగారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
 
కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆయన ఇంకా చెలరేగిపోయారు. కానీ జనం రేవంత్ రెడ్డికి తాళం వేసేశారు. ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతానని చెప్పాడు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు అన్నీఇన్నీ కావు. ఊహించని పరిణామంతో రేవంత్ రెడ్డి రెండేళ్ళపాటు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారట.
 
కెసిఆర్‌కు ధీటైన వ్యక్తి రేవంత్ రెడ్డేనని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంది. ఎన్నికల పర్యటన సమయంలో ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టప్ కూడా ఏర్పాటు చేసింది. అయితే అదంతా రేవంత్ రెడ్డి వాక్ చాతుర్యంగానేనని అర్థమైంది. ఆ మాట తీరే ఆయన్ను అత్యంత పతానవస్థకు దిగజార్చేసిందంటున్నారు విశ్లేషకులు. రేవంత్ రెడ్డి రెండేళ్లు మీడియాతో మాట్లాడకపోతే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎందుకు ఉంటుంది. మాట్లాడేవారికి కదా పదవి అనేది. అయితే పదవి పోతుందని తెలిసే రేవంత్ రెడ్డి జాగ్రత్తపడున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
రెండేళ్లంటే చిన్న విషయమేమీ కాదు. రాజకీయంగా యాక్టివ్‌గా ఉండకపోతే ఓటుకు నోటు కేసు కావచ్చు. మరో సమస్య కావచ్చు. రేవంత్ రెడ్డిని మరింత ఇబ్బందులకు గురిచేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అప్పుడు ఆయనకు కాంగ్రెస్ మద్దతు కూడా ఉండకపోవచ్చనంటున్నారు విశ్లేషకులు. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆయన్ను పార్టీ నుంచే పంపించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరి రేవంత్ ఏం చేస్తారన్నది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments