Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుతిన్ ప్రపంచ యుద్ధం IIIకి రెడీ అవుతున్నారా...? మాస్కోలో కోటి మంది ప్రజలకు బంకర్లు ఎందుకు?

ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపత్తి కలిగిన రష్యా దేశం మూడో ప్రపంచ యుద్ధం జరుగబోతోందంటూ ప్రకటన చేయడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా వద్ద అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నాయి. సిరియా విషయ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (17:09 IST)
ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపత్తి కలిగిన రష్యా దేశం మూడో ప్రపంచ యుద్ధం జరుగబోతోందంటూ ప్రకటన చేయడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా వద్ద అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నాయి. సిరియా విషయంలో అమెరికా, రష్యాలకు అస్సలు పడటంలేదు. అమెరికాతో ఉన్న సంబంధాలను రష్యా ఒక్కొక్కటిగా తెగ్గొట్టుకుంటూ వస్తోంది. ఆ దేశంతో మంతనాలను కూడా కటీఫ్ చెపుతోంది. అంతేకాదు... అమెరికా మిత్ర దేశాలతో సైతం మాటామంతి చేసేందుకు పుతిన్ ఇష్టపడటంలేదు. 
 
అందువల్లనే అక్టోబరు నెల 19న ఫ్రాన్స్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. మరోవైపు రష్యాలోని అధికారులు అణు యుద్ధమే వస్తే పౌరులను ఎలా కాపాడుకోవాలా అని యోచిస్తున్నారుట. ఇప్పటికే మాస్కో నగరంలోని కోటీ 20 లక్షల మంది ప్రజలను రక్షించేందుకు బంకర్లు కూడా నిర్మించినట్లు రష్యా అధికారి వెల్లడించడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితులన్నిటినీ చూస్తున్న రష్యా మాజీ అధ్యక్షుడు గోర్బొచెవ్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడబోతున్నట్లు అనుమానంగా ఉందన్నారు. 
 
అంతకుమించి కారణాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితులు ప్రపంచానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. పుతిన్ మాత్రం ప్రపంచంలో రష్యా పౌరులు ఎక్కడ ఉన్నా అంతా రష్యా దేశానికి చేరుకోవాలనీ, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అంటున్నారు. అదే జరిగితే భూమి మీద మానవాళి మనుగడ శూన్యమవుతుందని చెప్పక తప్పదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments