Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో తిరుమల సంగతి 'యాదగిరి' దేవుడెరుగ.. వ్యభిచార కేంద్రంగా 'గుట్ట'

వ్యభిచార కేంద్రంగా యాదగిరిగుట్ట...

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (14:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో యాదగిరి గుట్ట ఒకటి. దీని మరో తిరుమల చేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆ దిశగా ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు చర్యలు కూడా చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా ఈ యాదగిరిగుట్ట వ్యభిచారం కేంద్రంగా ఉందనే పచ్చినిజం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ గుట్టలో అనేక మంది మహిళలు దశాబ్దకాలంగా పడువు వృత్తిలో మగ్గుతున్నట్టు బహిర్గతమైంది. ఇది ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా తమను ఆదుకుంటుందేమోనని వందలాది కళ్లు ఆశగా ఎదురుచూస్తున్నాయి. యాదగిరిగుట్టలో చాలా కుటుంబాలు ఈ వృత్తిలో కొనసాగుతున్నాయి. 
 
తాజాగా 26 సంవత్సరాల ఓ సెక్స్ వర్కర్‌‌ తాము పడుతున్న కష్టాలను పూసగుచ్చినట్టు వివరించింది. ఆ మాటలు వింటే మనసున్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. 'మా తల్లి కూడా ఈ వృత్తిలోనే కొనసాగుతోంది. ఆమె ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కూతురిగా నాకు ఎవరూ ఏ పని ఇవ్వడం లేదు. చివరికి గత్యంతరం లేక నేనూ ఈ చీకట్లోకే రావాల్సొచ్చింది. అమ్మ అనారోగ్యం నుంచి బయటపడటానికి... అప్పులు తీర్చడానికి నాకు ఇదొక్కటే దారి. యాదగిరిగుట్టలో దాదాపు 112 కుటుంబాలు ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాయనీ, ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ అని చెప్పారు.
 
ఇదిలావుండగా, హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ కాలనీలో గుట్టు చప్పుడుగా సాగిస్తున్న వ్యభిచారం తంతును పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేసిన సైదాబాద్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి యజమానులు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే కిరాయికి ఇవ్వాలని పోలీసులు సూచించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం