Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ లో సింహం కుటుంబం.. మనుషులతోనే జీవనం

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (14:05 IST)
సింహాన్ని ఆంత దూరంలో ఉన్నా చూడాలంటేనే చాలా జాగ్రత్తగా పరిసరాలను గమనించ ఓ లుక్కేస్తాం. మరి అదే సింహం ఇంట్లోనే ఉంటే.. ఒకటి కాదు రెండు.. మరో ఏడు పిల్లలు ఇంట్లోనే ఉంటే అది మనుషులు కాపురం ఉండే ఇల్లా లేక సింహాలు కాపురం ఉంటే గుహనా అనే అనుమానం కలుగుతుందని కదూ.. అవును నిజమే.. కానీ పాకిస్తాన్ లో ఓ వ్యక్తి తన ఇంట్లోనే సింహాలను పెంచుకుంటున్నాడు. వాటితోనే మల్లయుద్ధం చేస్తాడు. వాటితోనే ఆట పాటా ఉంటుంది. ఇంతకీ ఏమిటా విశేషాలు రండీ మనమూ తెలుసుకుందాం. 
 
పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ ప్రాంతంలో ఫైజల్ అబ్బాస్ మహి అనే వ్యక్తి ఆఫ్రికా జాతికి చెందిన రాజా అనే మగ సింహం, రాణి అనే ఆడ సింహాన్ని తెచ్చుకున్నాడు. వాటిని పెంపుడు జంతువులుగా తన ఇంటిలోనే పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు వాటిని షికారుకు కూడా తీసుకెళ్ళతాడు. అంతకు ముందే రెండు సింహం పిల్లకు జన్మనిచ్చిన రాణి మళ్ళీ మరో ఐదు సింహాలకు జన్మనిచ్చింది. 
 
ఇంతకుముందు జన్మించిన రెండు సింహం పిల్లల వయసు తొమ్మిది నెలలు. ఆ సింహాలను కూడా అతడు ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. సాధారణంగా సింహానికి ఒక కాన్పులో రెండు లేదా మూడు మాత్రమే పిల్లలు జన్మిస్తాయి. ఏకంగా ఐదు జన్మించడంతో ఆ ఇంటి సింహం పిల్లలు కుక్క పిల్లలు, పిల్లిపిల్లలు పెరిగినట్లు పెరుగుతున్నాయి. ఇవి ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments