Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ప్ర‌జారాజ్యం... డిట్టో ప‌వ‌న్ కళ్యాణ్ జ‌నసేన‌నా? ఎందుకు ఈ అనుమానం?

విజ‌య‌వాడ‌ : అన్న‌య్య బాట‌లోనే త‌మ్ముడు ప‌య‌నిస్తున్నాడా? ఆరంభ సూర‌త్వంతో పార్టీ ప్రారంభ‌మై... ఎన్నిక‌ల స‌మ‌యానిక‌ల్లా తుస్సుమంటుందా? జ‌న‌సేన‌పై రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నాలివి. ప్ర‌జారాజ్యం... అంటూ చిరంజీవి తిరుప‌తిలో త‌న పార్టీని అశేష జ‌నసంద్రం మ‌ధ్

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (12:35 IST)
విజ‌య‌వాడ‌ : అన్న‌య్య బాట‌లోనే త‌మ్ముడు ప‌య‌నిస్తున్నాడా? ఆరంభ సూర‌త్వంతో పార్టీ ప్రారంభ‌మై... ఎన్నిక‌ల స‌మ‌యానిక‌ల్లా తుస్సుమంటుందా? జ‌న‌సేన‌పై రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నాలివి. ప్ర‌జారాజ్యం... అంటూ చిరంజీవి తిరుప‌తిలో త‌న పార్టీని అశేష జ‌నసంద్రం మ‌ధ్య ప్ర‌క‌టించారు. అప్పుడు ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. 
 
ఆ పార్టీలోకి మారిపోవాల‌ని, ఆ పార్టీ టిక్కెట్ దొరికితే, ఇక విజ‌యం నల్లేరు మీద నడక అని బ‌డా నేత‌ల నుంచి, చోటా నేత‌ల వ‌ర‌కు భావించారు. పార్టీ ప్ర‌క‌టించిన వెంట‌నే ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం బేర‌సారాలు ప్రారంభించారు. తీరా ఎన్నిక‌ల్లో చిరంజీవి పార్టీ తుస్సుమంది. టిక్కెట్లు అమ్ముకున్నార‌నే ఆరోపణలను చిరంజీవి అండ్ కో మూటక‌ట్టుకుంది.
 
ఇపుడూ...అదే సీన్ రిపీట్ అవుతోంది... ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తే, ఆయ‌న జ‌న‌సేన‌లో చేరిపోదామ‌ని ప‌లువురు నేత‌లు ఇప్ప‌టి నుంచే క‌ల‌లుగంటున్నారు. అత్తారింటికి దారేదంటూ... ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాల‌ని ఎంక్వ‌యిరీలు చేస్తున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కింద టీడీపీలోకి చేరాల‌నుకునే పెద్ద‌లూ.. ఇపుడు ప‌వ‌న్ బ‌హిరంగ స‌భతో ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. మ‌రోప‌క్క చిరంజీవిలా ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌జాయాత్ర‌ల‌తో పార్టీని స్టార్ట్ చేస్తుండ‌టంతో ఈ ఊపు... ఆ ఊపు ఒక‌టే అవుతుందా...అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments