రాష్ట్రమంత్రి అమర్‌నాథ్ రెడ్డికి దూరంగా నేతలు.. ఎందుకు?
చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అమరనాథ్ రెడ్డి ఉన్నట్లుండి వైకాపా తీర్థం పుచ్చుకుని ప్రజల్లోనే చులకనైపోయారు. కనీసం అభివృద్ధి కూడా జరుగకపోవడంతో చేసేది లేక మళ్ళీ టిడిపిలోకి వచ్చారు.
చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అమరనాథ్ రెడ్డి ఉన్నట్లుండి వైకాపా తీర్థం పుచ్చుకుని ప్రజల్లోనే చులకనైపోయారు. కనీసం అభివృద్ధి కూడా జరుగకపోవడంతో చేసేది లేక మళ్ళీ టిడిపిలోకి వచ్చారు. ఇలా ఉన్న పార్టీలో మళ్ళీ చేరారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం అమరనాథ్ రెడ్డి పార్టీలో చేరడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రస్తుతం భారీ పరిశ్రమల శాఖామంత్రిగా అమరనాథ్ రెడ్డి ఉన్నా సరే ఆయన వెనుక కనీసం ఒక్కరంటే ఒక్క నాయకుడు వెళ్ళడం లేదట. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల్లో ఎవరో ఒకరు తప్ప మిగిలిన వారు ఆయనకు దూరంగా ఉంటున్నారట.
పార్టీకి సంబంధించిన సమావేశాలు ఏది జరిగినా అమరనాథ్ రెడ్డిని మాత్రం పిలవడం లేదట. చిత్తూరులో ఈ మధ్య కొన్ని కార్యక్రమాలు జరిగినా అమరనాథ్ రెడ్డిని పిలువకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట. జిల్లాకు చెందిన మంత్రిగా ఉన్న తననే పిలువకుంటే ఏంటని తన వారితో చెప్పారట అమర్. తిరుపతిలో కూడా నేతలు అమరనాథ్ రెడ్డి కలవడం లేదట.
తెలుగుదేశంపార్టీలో ఎన్నో యేళ్ళ పాటు ఉండి ఆ తరువాత పార్టీని వదిలి వెళ్ళిన వ్యక్తి తిరిగి అదే పార్టీలోకి రావడం ఏమిటన్నది నేతల ప్రశ్న. అంతేకాదు అమర్ ఏ కార్యక్రమానికి హాజరైనా కూడా ఎవరూ వెళ్ళొద్దని కొంతమంది సీనియర్లు క్రిందిస్థాయి నాయకులకు చెప్పారట. మరి దీనిపై అధినేత బాబు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది.