Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానంద మహిళా భక్తుల పోలీసులపై థూ... అంటూ ఉమ్మేశారు... ఆ తర్వాత...?

నిత్యానందస్వామి. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. సినీనటి రంజితతో కలిసి ఏకాంతంగా గడుపుతూ అడ్డంగా దొరికిపోయిన నిత్యానందస్వామి ఆ తర్వాత కూడా వార్

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (13:09 IST)
నిత్యానందస్వామి. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. సినీనటి రంజితతో కలిసి ఏకాంతంగా గడుపుతూ అడ్డంగా దొరికిపోయిన నిత్యానందస్వామి ఆ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న నిత్యానందకు గత కొన్నిరోజులుగా భూములపై కన్ను పడింది. ఖాళీ భూములు కనిపిస్తే చాలు నేరుగా నిత్యానందస్వామి రంగంలోకి దిగి స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల అండతోనే నిత్యానంద రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
తన ఆశ్రమాలను విస్తరించాలనుకుని తమిళనాడులోని తిరువన్నామలైలో 20 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు నిత్యానందస్వామి శిష్యులు. పర్ణశాల పేరుతో నిత్యానంద స్వామి శిష్యులు తిరువన్నామలైలో టెంట్లు వేశారు. కొండ ప్రాంతాల్లో 20 ఎకరాలను కొట్టేసేందుకు ప్రయత్నించారు. గుడారాలు వేసి నిత్యానంద ఫొటోలు పెట్టేశారు. పూజలు, పునస్కారాలు చేశారు. దీన్ని పసిగట్టిన కమ్యూనిస్టు పార్టీలు.. కొండ ప్రాంతాలను నిత్యానంద స్వామి కబ్జా చేస్తున్నాడంటూ తిరువన్నామలై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. పోలీసులు రంగప్రవేశం చేసి కొన్ని గుడారాలను తొలగించారు. కొంత మంది స్థానికులు కూడా నిత్యానందకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
బెంగళూరు శివారులో నిత్యానందకు ఆశ్రమం ఉంది. అయితే ఆయన ఎప్పటి నుంచో తమిళనాడులోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం అప్పట్లో బయటపడడంతో తమిళ పీఠాధిపతులు ఆయన్ను తరిమేశారు. తాజాగా తిరువన్నామలైలో నిత్యానంద ధ్యానపీఠం కట్టించాలని భావించి.. అక్కడి చిన్న చిన్నకొండలను కబ్జా చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే 20 ఎకరాల మేర ఫెన్సింగ్ వేయించారు. ఇందుకోసం మహిళా భక్తులను ఉపయోగించుకున్నాడు. వారిచేత ఫెన్సింగ్ వేయించి, గుడారాలు వేయించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న గిరిజనులను తరిమికొట్టారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు కలిగించుకొని నిత్యానంద స్వామికి వ్యతిరేకంగా తిరువన్నామలై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి కబ్జా చేసిన ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. 
 
దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. కబ్జా స్థలంలో ఏర్పాటు చేసిన గుడారాలు, ఫోటోలను పోలీసులు తొలగించారు. మహిళా భక్తురాళ్లను, భక్తులను అక్కడి నుంచి తరిమేశారు. ఈ క్రమంలో నిత్యానంద భక్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో నిత్యానంద శిష్యురాళ్లయిన మహిళా భక్తులు పోలీసులపై థూ... అంటూ ఉమ్మేసారు. అయితే స్థానికులు కూడా పోలీసులకు మద్దతుగా వచ్చి నిత్యానంద భక్తులను తరిమేశారు. 
 
నిత్యానంద స్వామిపై ఇప్పటి వరకు రేప్, చీటింగ్ వంటి కేసులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కబ్జా కేసు నమోదైంది.  కబ్జా కేసులో నిత్యానందను మరోసారి పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అయితే ఆ భూమిని మాత్రం ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని నిత్యానంద మానడం లేదట. అవసరమైతే మహిళలందరినీ స్థలంలో కూర్చోబెట్టి ధర్నా నిర్వహించడానికి నిత్యానంద సిద్థమవుతున్నారట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments