Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిని పోలిన మరో గ్రహం..!!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (07:47 IST)
మనిషి మనిషి వెతుక్కుంటూ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. పర్లాంగులు, మైళ్ళు.. కిలోమీటర్లు.. కాంతి సంవత్సరాల ప్రయాణంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనిషికి తను నివాసం ఉన్న గ్రహం లాంటి గ్రహం ఒకటి కొత్తగా కనిపించింది. దానిని సూపర్ ఎర్త్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తదుపరి అక్కడ ఏముంటుందనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకారం వివరాలేంటంటే..
 
అమెరికాకు చెందిన నాసా కెప్లర్ అంతరిక్ష నౌక కొత్త మిషన్‌లో ఓ సూపర్ ఎర్త్‌ను గుర్తించింది. ఈ సూపర్ ఎర్త్ భూమికి సుమారు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందట. ఈ గ్రహానికి హెచ్‌ఐపీ 116454బీగా పేరు పెట్టేశారు.  దీని వ్యాసార్థం భూమికంటే రెండున్నర రెట్లు, బరువు భూమికంటే 12 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రకమైన గ్రహం మన సౌర వ్యవస్థలో లేదని పేర్కొం టున్నారు.
 
కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్న ఆండ్రూ వెండర్‌బెర్గ్ కే2 మిషన్‌కు సంబంధించిన డేటాను సేకరించి ఈ సూపర్ ఎర్త్‌ను గుర్తించాడు. హెచ్‌ఐపీ 116454బీ ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని, దీని పరిభ్రమణానికి తొమ్మిది రోజుల సమయం పడుతోందని పేర్కొన్నాడు. అయితే ఈ నక్షత్రం సూర్యుని కంటే చిన్నగా.. చల్లగా ఉందని, వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే జీవులు బతికే అవకాశం ఉంటుందా! అనే అంశాల పరిశీలన సాగాల్సి ఉంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments