బీజేపీకి చుక్కలు.. ఎమ్మెల్యేలకు గాలం.. కేసీఆర్ పక్కా ప్లాన్.. ఏంటది?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (15:13 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి చుక్కలు చూపించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారని సమాచారం. తెలంగాణలో బీజేపీని నామరూపాలు లేకుండా చేసే మరో అరుదైన అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. నలుగురు కాదు నలభై మంది టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు టచ్‌లో తమతో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా బాహాటంగా బీజేపీ చెప్తూ వస్తోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు బీజేపీ సన్నిహితులు, నలుగురు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలతో జరిపిన బేరసారాలని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. డీల్‌కు పక్కా సాక్ష్యాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెద్ద వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. 
 
కేసీఆర్ వ్యూహాలు వేరే ఉన్నాయట. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తున్న తరుణంలో దొరికిన ఈ డీల్ ఆధారాలను జాతీయ స్థాయిలో బయటపెట్టి, బీజేపీని జాతీయస్థాయిలో దెబ్బ తీసే అరుదైన అవకాశం ఉందని టాక్ వస్తోంది. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టడంకంటే ఢిల్లీలో పెడితే ఆశించినంత పొలిటికల్ మైలేజీ వస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పడంతో కేసీఆర్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లు టాక్.
 
అందుకే హైదరాబాద్ ప్రెస్ మీట్ రద్దయిందని, ఒకటి రెండు రోజుల్లో అన్నిజాతీయ మీడియా ఛానెళ్లతో పాటు ఇంగ్లీష్ ఛానళ్లను కూడా రప్పించి ఢిల్లీలో కేసీఆర్ భారీ ప్రెస్ మీట్ ఉండనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments