2019 ఎన్నికల కోసం తమ్ముడు పార్టీలోకి అన్నయ్య.. జనసేనలో కీలక పదవి..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆపై కాంగ్రెస్‌లో పార్టీ విలీనం చేసి.. అంతగా కలిసిరాకపోవడంతో సినిమాల వ

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:44 IST)
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆపై కాంగ్రెస్‌లో పార్టీ విలీనం చేసి.. అంతగా కలిసిరాకపోవడంతో సినిమాల వైపు దృష్టి పెట్టిన చిరంజీవి.. ప్రస్తుతం మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారని టాక్ వస్తోంది. అంతేగాకుండా తమ్ముడు జనసేన పార్టీలో అన్నయ్యకు మంచి హోదాతో కూడిన పదవి రానుందని సమాచారం. 
 
మొన్నటివరకు వేర్వేరుగా వుండిన అన్నయ్య, తమ్ముడు అభిమానులు ప్రస్తుతం కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అభిమాన సంఘాలు రెండూ కలసి పోవడం ఎన్నికలకు కలసి పని చేస్తామని చెప్పడం చూస్తుంటే ఏపీ రాజకీయ తెరపై సందడి పెరిగిపోతోంది. 2019 ఎన్నికలకు జనసేన వేగంగా రెడీ అవుతోందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
అధికార, ప్రతిపక్ష పార్టీలతో పోటీపడేందుకు జనసేన పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తుందని.. అందుకే పవన్ ఏపీలో యాత్ర మొదలెట్టారని.. తెలంగాణలోనూ పట్టుకోల్పోకుండా వుండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 
 
జనసేనకు మొన్నటివరకు ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనాని పవన్ వెనక వున్నామని ప్రకటించడంతో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి మంచి ఫలితాలుంటాయని టాక్. ఇందులో భాగంగానే మెగా ఫ్యాన్సును అన్నయ్య తమ్ముడి జనసేనలోకి పంపారు.  రానున్న కాలంలో చిరంజీవి కూడా తమ్ముడి పార్టీలో కీలక పదవిని అలంకరిస్తారని ఊహాగానాలొస్తున్నాయి. 
 
చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే అంతా భావించారు. కానీ చిరంజీవిని పవన్ తిరిగి తన పార్టీలోకి ఆహ్వనిస్తారని జనసేనలో గౌరవ అధ్యక్ష పదవి కూడా పవన్ కట్టబెట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే.. జనసేనకు మరింత బలంతో ఎన్నికల్లోకి దూసుకెళ్తుందని రాజకీయ పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments