Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల బాలుడు తెలంగాణ సీఎం కేసీఆర్.. పాలనపై ఓ సమీక్ష!

Webdunia
గురువారం, 3 జులై 2014 (08:49 IST)
అరవై మూడేళ్ల కల సాకారమైన రోజు. యావత్ తెలంగాణా ప్రజల ఆత్మ గౌవరం సగర్వంగా నిలబడిని రోజు. 13 సంవత్సరాల ఉద్యమనాయుకుడుకి పట్టం కట్టిన రోజు. సరిగ్గా ముప్పై రోజులు క్రితం ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) ప్రమాణం చేసిన రోజు. మరి నెలబాలుడి ప్రస్థానం ఈ నెల రోజులు ఎలా సాగింది. పాలానానుభవం లేని ఉద్యమ పార్టీ ఎలా పరిపాలించింది అంటే ముఖ్యమంత్రిగా ఆయన మార్క్ పడిందనే చెప్పాలి. అక్కడక్కడా కాస్త తడబడినా... వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా... ఈ నెల రోజుల పాలనలో తనదైన ముద్రను వేశారని చెప్పుకోవచ్చు. 
 
మంత్రివర్గ కూర్పులో ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా, అన్ని అసంతృప్తులు తలెత్తకుండా తన కనుసన్నల్లో మెలిగే వారినే క్యాబినెట్‌లో స్థానం కల్పించి తన చాణుక్యతను ప్రదర్శించారు. తన లక్ష్యాలేమిటో.. ఆ దిశగా తన సహచరులు ఎలా అడుగుల వేయాలో దిశానిర్ధేశం చేసుకున్నారు. ఇక పరిపాలనా యంత్రాగం విషయానికొస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ఒక లిస్ట్ తయారు చేసుకుని మరీ అధికారులను నియమించుకుని పక్కా విజన్‌తో ముందుకెళుతున్నారు.
 
ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు జరిపిన, జరిగిన తీరును చూస్తే ఇటు ప్రభుత్వాధినేతగా అటు ప్రతిపక్ష నేతగా రెండు పాత్రలూ తనే పోషించి బంగారు తెలంగాణా నిర్మాణంలో తన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు. తెలంగాణాలో కుటుంబాలు కంటే రేషన్ కార్డులు ఎక్కువుగా ఉన్నాయంటూ, అంకెల్లో కనిపిస్తున్న లక్షల ఇళ్లు ఎక్కడున్నాయంటూ గత ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పూర్తిగా సఫలమయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్  ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడంలో తన రాజకీయచతురతను చాటారు. రైతుల రుణమాఫీ గురించి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించినా కాలపరిమితి లేకుండా బంగారంపై తీసుకున్న రుణాలకు తోడు, లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించి తెలంగాణా రైతాంగంలో ప్రభుత్వం పట్ల నమ్మకం కలిగించారు కేసీఆర్.
 
ఇక పాలనాపరంగా అనేక సంస్కరణలకు నాంది పలికారు. ముఖ్యంగా పోలీసులకు వారంతపు సెలవులతోపాటు. పోలీస్ యంత్రాంగాన్నీ సమూలంగా ఆధునీకరణ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు మమ్మురం చేశారు. హైదరాబాద్‌ను స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతూనే హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చే విధంగా ప్రభుత్వం  పెట్టుబడులు ఆకర్షించడంలో సఫలీకృతం కాగలిగారు. ఇప్పటికే టాటాలు, హీరో కంపెనీలు తెలంగాణాలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చారు. తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ నాయకులను, కవులను మేధావులనూ పాత్రికేయులను తన ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 
 
ఇక  ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం మాత్రం రెండు రాష్ట్రాల మద్య కొత్త వివాదాన్నే లేపింది. సీమాంధ్రకు చెందిన విద్యార్దులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే ప్రసక్తేలేదని తెగేసి చెప్పడం, 1956ను ప్రామాణికంగా తీసుకోవడం వంటి చర్యలతో కొంత గందరగోళం నెలకొని ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రోజుకో ప్రకటన రావడంతో సమస్య జటిలంగా మారింది. ఇక ఉద్యోగులు విషయంలోనూ తెలంగాణా ప్రభుత్వం అస్పష్టంగానే ఉంది. తెలంగాణా ఉద్యోగులే ఇక్కడ ఉంటారని సీఎం ప్రకటించడం మరో గందరగోళ అంశం. 
 
ఇక నెలరోజుల పాలనలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైంది... గురకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారం. అధికారం చెపట్టిన 20 రోజులకే  భూఆక్రమణలపై విరుచుకు పడిన కేసీఆర్, నగరంలో జరిగిన మరికొన్ని అక్రమణల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తామని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నా అంతిమంగా అది తెలంగాణా ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేస్తుందని విశ్వసిస్తున్నారు. 
 
చివరగా మెట్రో రైలు విషయంలోనూ కాస్త గందరగోళం నెలకొల్పారు. దీంతో కేసీఆర్ కాస్త పట్టువిడుపుగా ఉంటే మంచిదన్న విమర్శ వినిపిస్తుంది. ఇటు పాలనాపరమైన నిర్ణయాలు విషయంలో దూకుడుగా ఉన్న కేసీఆర్, పార్టీని పటిష్టం పరుచుకోవడంలోనూ అంతే దూకుడుగా వహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు గులాబీ కండువా కప్పి శాసనమండలి ఛైర్మన్ పీఠంపై స్వామి గౌడ్‌ను కూర్చోబెట్టడంలో కేసీఆర్ రచించిన రాజకీయ వ్యూహం ఫలించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు దిమ్మదిరిగిపోయింది. ప్రత్యర్థి పార్టీలను మానసికంగా మానసికంగా దెబ్బదీయడంతో పాటు ఎంఐఎం వంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని బల్దియా ఎన్నికల్లో పాగా వేయాలన్నది కేసీఆర్ తదుపరి లక్ష్యంగా ఉంది. మొత్తానికి కెసీఆర్ నెల రోజుల పాలనకు తెలంగాణా ప్రజలు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments