Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది సామాన్యమైన హెలికాప్టర్ కాదు, మరి ఎందుకు ఇలా జరిగింది?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:24 IST)
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. సమాధానం ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంది. సాంకేతిక లోపమా.. మానవ తప్పిదమా.. లేకుంటే ఏదైనా కుట్ర అన్న మూడు ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. పొగమంచు కారణంగా ముందు ఏముందో కనబడకపోవడమే హెలికాప్టర్ ప్రమాదానికి కారణంగా మొదట్లో భావించారు.

 
కానీ ఇదే ఎన్న అనుమానాలకు తావిస్తోంది. దట్టమైన పొంగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణం వద్దని ఎటిసి నుంచి ముందే హెచ్చరికలు వెళ్ళాయి. నిజానికి ఈ హెచ్చరికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎంఐ-17 వి5 హెలికాప్టర్. 

 
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణించగల సామర్థ్యం హెలికాప్టర్ సొంతం. అవసరమైతే 18 వేల అడుగులపై నుంచి కూడా ప్రయాణించగలదు. ఓ వైపు దట్టమైన పొగమంచు కనిపిస్తుంటే తక్కువ ఎత్తులో ఎందుకు ప్రయాణించరన్నదే ప్రశ్న. 

 
హెలికాప్టర్ కూలడానికి ముందు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అన్నది తేలాల్సి ఉంది. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉన్నప్పుడు సాధారణంగా మరింత ఎత్తుకు వెళతారు. కానీ ఆర్మీ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో వెళ్ళింది. పైగా సూలూరు ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి కూనూరు వద్ద వాతావరణం ఎలా ఉంటుందన్నది బాగా అనుభవం ఉంది.

 
సూలూరు వెల్డింగన్ డిఫెన్స్ కాలేజీ వద్ద హెలికాప్టర్లు తిరుగుతూనే ఉంటాయి. అయినా సరే ప్రమాదాన్ని ఎందుకు నివారించకలేకపోయారన్నదే మిస్టరీ. ముందుగా తక్కువ ఎత్తులో ఎందుకు ఎగిరింది. గమ్యం వచ్చేస్తుంది కాబట్టి ఎత్తు తగ్గించారా? ఏ సమయంలో హెలికాప్టర్ కిందకు దిగిందన్నది తెలిస్తేనే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి.

 
ఈ సాంకేతిక సమాచారం మొత్తం బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అయి ఉంటుంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ వైమానిక దళానికి చెందింది. అంటే ఈ హెలికాప్టర్లో ప్రత్యామ్నాయ వ్యవస్థలు చాలానే ఉంటాయి. అలాంటి సమయంలో ప్రమాదంలో ఉన్నామన్న సంకేతాలు పంపించవచ్చు. 

 
కానీ అలాంటి సంకేతాలు ఏమీ రాలేదని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాలకు ఎటిసితో సంబంధాలే తెగిపోయాయట. ఆ తరువాత కొంత సమయానికే ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. అంటే ఆ గ్యాప్ లోనే ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు.

 
లేదంటే హెలికాప్టర్ కుప్పకూలడంతోనే ఎటిసితో సంబంధాలు తెగిపోయి ఉండాలి. ఒకవేళ హెలికాప్టర్ కుప్పకూలినా భారీ పేలుడు జరగ్గకుండా చూసే వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఎంఐ హెలికాప్టర్ విషయంలో అలా జరగలేదు. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి కారణాలు కూడా అన్వేషించాల్సి ఉంది. 

 
ఏదిఏమైనా జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ఎలా ప్రమాదానికి గురైందన్నది ఇప్పుడిప్పుడే తెలిసే అవకాశం లేదంటున్నారు నిపుణులు. బ్లాక్ బాక్స్ సమాచారాన్ని బయటకు తీసి విశ్లేషించాలంటే కొన్ని వారాల నుంచి ఏడాదికి పైగా పట్టొచ్చని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments