Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కి ఫుల్ స్కోర్, జనసేనతో వైసిపికి గట్టి పోరు తప్పదా?

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (19:08 IST)
పవన్ కళ్యాణ్. నాక్కొంచెం తిక్కుంది... ఐతే దానికో లెక్కుంది. ఇది సినిమా డైలాగ్. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి... గత కొన్నిరోజులుగా జనసేన వర్సెస్ వైసిపిని చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ వైసిపి మంత్రులను బాగా ఇరకాటంలో నెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోసాని కృష్ణమురళి ఏకంగా పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మాటల దాడి జరిగిన తర్వాత, నటుడు-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగ్గకుండా పూర్తి పరిణతిని ప్రదర్శించారని చెపుతున్నారు విశ్లేషకులు.

 
పవన్ మంగళగిరిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పోసాని వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో స్పందిస్తారని అనుకున్నారు. కానీ జనసేనాని మరోలా మాట్లాడారు. పవన్ తన గౌరవాన్ని, పార్టీ అధ్యక్షుని అలంకారాన్ని తగ్గకుండా తనదైన శైలిలో ప్రసంగించారు. పరోక్షంగా విమర్శలు చేస్తూనే తనను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులందరినీ తాను గమనిస్తున్నానని అన్నారు. రాజకీయాలకు, వ్యక్తిగత దాడులకు భయపడబోనని చెపుతూ వైసిపిని టార్గెట్ చేసారు, ఆ పార్టీపై పోరాడతానని చెప్పాడు.

 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి ఓటమి తప్పదని పవన్ ధైర్యంగా చెప్పారు. జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. పవన్ నుంచి ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశించిన విశ్వాసం ఇది. పవన్ తన పార్టీ ప్రజలపై రాజకీయ దాడుల అంశాన్ని కూడా లేవనెత్తారు. పోరాటానికి ప్రేరేపించేది వైసిపియేనని, జనసేన తగిన సమాధానం ఇస్తుందని ఆయన అన్నారు.

 
తన ప్రసంగం మొత్తంలో ఎక్కడ కూడా పవన్ భావోద్వేగం లేదా కోపం లేకుండా సమస్యలపైన, అంశాల వారీగా ప్రసంగించారు. వైసిపి కమ్మ సామాజికవర్గాన్ని పూర్తిగా లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో వారిని భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆయన అన్నారు. ఆ బాధితులకు తనతో పాటు తన పార్టీ అండగా ఉంటుందని పవన్ చెప్పారు.

 
ప్రతి కులానికి, ప్రతి సమాజానికి మనుగడకు సమాన హక్కు ఉందని పవన్ అన్నారు. ఈ ప్రకటన ద్వారా, "నేను కమ్మల కోసం ఉన్నాను" అనే సంకేతాన్ని పంపారు. అట్టడుగున ఉన్న కమ్మ సామాజికవర్గ ప్రజలను పవన్ చేరువయ్యేందుకు ప్రయత్నించారు. పవన్ ప్రసంగం కాపు- కమ్మ కమ్యూనిటీలలో బాగా స్కోర్ చేసింది. దీని ద్వారా, పవన్ నిజమైన పరిపక్వత చూపించారని అంటున్నారు.

 
అన్ని వర్గాల ప్రజలను ఆలింగనం చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు పవన్. ఇది నాయకుడి నిజమైన గుణం. అన్ని మతాలు, కులాలు తనకు ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు. జనసేన నిజమైన లౌకిక పార్టీ అని అన్నారు. వారి రాజకీయ చతురతతో అధికార వైసీపీని కార్నర్ చేశారు. వ్యక్తిగత దాడికి దిగకుండా, పవన్ తన రాజకీయ చతురతను చూపించాడు. పవర్ స్టార్ మెల్లగా పరిణితి చెందిన నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా అభివృద్ధి చెందుతున్నారు.

 
ఇది రాబోయే రోజుల్లో ఆయనకి, ఆయన పార్టీ జనసేనకు సహాయం చేయగలదనడంలో అనుమానం లేదు. పవన్ తన వైఖరితో ఏపీలో ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద పవన్ తన ప్రసంగంతో మంచి మైలేజ్ సాగించారని చెప్పొచ్చు. ఇది పాలక వైసిపిలో మంత్రులకు కాస్త ఇబ్బందికరమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments