Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగం రాకతో ఆగం ఆగం... కాంగ్రెస్ పార్టీకి డి.కె. అరుణ గుడ్ బై...?

గద్వాలలో కాంగ్రెస్ పార్టీ కోట బద్దలు కాబోతుందా.. ఆ కోట పైన కాషాయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా. కాంగ్రెస్ పార్టీకి డి.కె. అరుణ హ్యాండ్ ఇవ్వబోతున్నారా. పాలమూరు జిల్లాల్లో సెగలు రేపుతున్న కుమ్ములాటలు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పార్టీ మారడాని

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (17:01 IST)
గద్వాలలో కాంగ్రెస్ పార్టీ కోట బద్దలు కాబోతుందా.. ఆ కోట పైన కాషాయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా. కాంగ్రెస్ పార్టీకి డి.కె. అరుణ హ్యాండ్ ఇవ్వబోతున్నారా. పాలమూరు జిల్లాల్లో సెగలు రేపుతున్న కుమ్ములాటలు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పార్టీ మారడానికి కారణమయ్యాయన్నది తెలంగాణా గడ్డమీద నడుస్తున్న హాట్ హాట్ డిస్కషన్.
 
కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇవ్వాలన్న నిర్ణయానికి డి.కె. అరుణ వచ్చేశారట. బిజెపిలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైపోయారట. ఈమధ్య కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయ గోల బాగా ఎక్కువైంది. ఒకవైపు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టిపిసిసి పదేపదే చెబుతోంది. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు.
 
నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్‌కు వస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో మహబూబ్ నగర్‌లో నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. నాగం రాకను డి.కె. అరుణ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. గతంలో నాగం టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఇప్పుడు ఆయన్ను ఎలా తీసుకుంటారన్నది డి.కె. అరుణ వర్గం వాదన. అయితే కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పి నాగం చేరికకు మార్గం సుగుమమం చేశారన్న ప్రచారం ఉంది.
 
హైకమాండ్ వర్గం వద్దకు వెళ్ళి డి.కె. అరుణ వర్గం ఎంత చెప్పినా నాగం రాక మాత్రం ఆగలేదు. రాహుల్ సమక్షంలో కొద్ది నెలల కిందట కాంగ్రెస్‌లో చేరిపోయారాయన. దీంతో జైపాల్ రెడ్డికి, డి.కె.రెడ్డికి మధ్య రాజకీయంగా తెర వెనుక పోరు నడుస్తోందన్నది జిల్లాలో నడుస్తున్న చర్చ. టి.ఆర్.ఎస్‌కు చెందిన శివకుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని డి.కె.అరుణ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారట. అయితే వీరిని పార్టీలోకి రానివ్వకుండా జైపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నది డి.కె.వర్గాల వాదన. ఇది కూడా ఆమె అసంతృప్తికి కారణమట. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాల్లో డి.కె.అరుణ హాజరు కావడం లేదట. దీంతో ఆమె బిజెపిలోకి వెళ్ళిపోయేందుకు సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments