Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకస్మాత్తుగా అజిత్ పేరు ఎందుకు? అన్నాడీఎంకేను ఆదుకునే సత్తా అజిత్ ఒక్కడికే సాధ్యమా?

తమిళనాడులో తల అని ముద్దుగా హీరో అజిత్‌ను పిలుచుకుంటారు. ఇప్పుడీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జయలలిత స్వర్గస్తులైన తర్వాత ఆమె స్థానంలో అజిత్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకె పార్టీని ఆదుకునే సత్తా అజిత్ ఒక్కడికే సాధ్యమనే వాదనలు విని

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (20:09 IST)
తమిళనాడులో తల అని ముద్దుగా హీరో అజిత్‌ను పిలుచుకుంటారు. ఇప్పుడీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జయలలిత స్వర్గస్తులైన తర్వాత ఆమె స్థానంలో అజిత్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకె పార్టీని ఆదుకునే సత్తా అజిత్ ఒక్కడికే సాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి వద్ద తమిళ హీరో అజిత్ నివాళులు అర్పించారు. ఆయన బుధవారం తెల్లవారుజామున మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు తన భార్య షాలినితో వచ్చి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలంటూ దైవాన్ని ప్రార్థించారు. 
 
కాగా, ముఖ్యమంత్రి జయలలిత అంటే అజిత్‌కు ప్రత్యేకమైన అభిమానం. జయలలితను అజిత్ కన్నతల్లిగా భావిస్తూ వచ్చారు. అలాగే, అజిత్ అంటే జయలలితకు కూడా ప్రత్యేకమైన అభిమానం. దీనికి నిదర్శనంగా పలుమార్లు అజిత్‌ను పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి జయలలిత పిలిపించి మాట్లాడారు కూడా. అప్పటి నుంచి జయలలిత రాజకీయ వారసుడు అజిత్ అంటూ విస్తృతమైన ప్రచారం కూడా ఉంది. 
 
ఈ నేపథ్యంలో జయలలిత చనిపోయిన సమయంలో అజిత్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బల్గేరియా దేశంలో ఉన్నాడు. అమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే అజిత్ షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకు బయలుదేరారు. అయినప్పటికీ తల్లి లాంటి అమ్మను కడసారి చూడలేక పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments