Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష శవంతో నాటకాలాడారు... మీడియాతోనే సాధ్యం.... బ్యూటీషియన్ శిరీష పేరేంట్స్

బ్యూటీషియన్ శిరీషది ముమ్మాటికీ హత్యేనంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెను కుకునూరు పల్లిలోనే చంపేసి ఆ శవంతో హైదరాబాదు వచ్చి రాజీవ్, శ్రవణ్ ఇద్దరూ నాటకాలాడారంటూ ఆరోపిస్తున్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయించాలని తాము మీడియా ద్వారా పోలీసు వారిని అ

Webdunia
శనివారం, 1 జులై 2017 (21:10 IST)
బ్యూటీషియన్ శిరీషది ముమ్మాటికీ హత్యేనంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెను కుకునూరు పల్లిలోనే చంపేసి ఆ శవంతో హైదరాబాదు వచ్చి రాజీవ్, శ్రవణ్ ఇద్దరూ నాటకాలాడారంటూ ఆరోపిస్తున్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయించాలని తాము మీడియా ద్వారా పోలీసు వారిని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఆర్జే స్టూడియోకు శవాన్ని తీసుకువచ్చి ఆమె చేతి వేలితో బయోమెట్రిక్ మెషీన్ ద్వారా థంబ్ ఇంప్రెషన్ చేయించి లోనికి తీసుకెళ్లి ఆ శవానికే ఉరి వేసి నాటకాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. 
 
వీడియో కాల్ చేస్తే రాజీవ్ అనే వ్యక్తి ఎందుకు అటెండ్ చేయలేదు..? ఎందుకంటే ఆమె ఫోన్ నుంచి కాల్ చేసింది అతడే... అతడి ఫోన్ లిప్ట్ చేయకుండా నాటకలాడింది అతడే కాబట్టి అంటూ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నేరస్థులను కాపాడాలని పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో తమకు అర్థం కావడంలేదన్నారు. మరోవైపు శిరీష భర్త మాట్లాడుతూ... తన భార్య క్యారెక్టర్‌పై లేనిపోని నిందలు వేయొద్దన్నారు. తన భార్య శిరీషతో తాను చాలా హ్యాపీగా ఉండేవాడినని భర్త సతీష్ చంద్ర అన్నారు. 
 
ఆర్జే స్టూడియోలో మాత్రమే శిరీష పనిచేయలేదని.. బెంగళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్‌లో కూడా శిరీష పార్ట్ టైమ్‌గా పనిచేసిందని సతీష్ చంద్ర చెప్పారు. దాదాపు ఏడాది నుంచి బెంగళూరు సంస్థలో ఆమె పనిచేస్తుందని.. నెలకు 30 నుంచి 40వేల వరకు డ్రా చేసేదని.. తాను నెలకు 15-20 వేల దాకా సంపాదించే వాడినని.. అయినప్పటికీ తమ మధ్య ఇగో సమస్యలు రాలేదని.. హ్యాపీగా ఉండేవాళ్లమని సతీష్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆర్జే స్టూడియోలో చేరి ఆరునెలలు అయ్యిందన్నారు.
 
ఈ కేసును ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని.. రోజూ మీడియాలో శిరీషను చూపించి.. ఆమె క్యారెక్టర్‌పై నిందలేస్తున్నారని సతీష్ చంద్ర వాపోయారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలూ లేవని అన్నారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పుకొచ్చారు. తాను ఎన్జీవో సంస్థ ఆశ్రే ఆకృతిలో పనిచేస్తుంటానని, చెవిటి, మూగ పిల్లలకు తాను వంట చేసి పెడతానన్నారు. శిరీషది ఆత్మహత్య కాదని.. ఆమెను హత్య చేశారని సతీష్ చంద్ర వాదిస్తున్నారు. ఈ కేసుపై స్పెషల్ ఎక్వైరీ జరిపించాలని సతీష్ చంద్ర డిమాండ్ చేశారు.
 
శిరీషను హత్య చేసిన తర్వాతే హైదరాబాదుకు తీసుకొచ్చారని, ఆమె ప్రమాదంలో ఉండటంతోనే రెండుసార్లు లొకేషన్ తనకు షేర్ చేసిందని సతీష్ చంద్ర అన్నారు. రాజీవ్, శ్రవణ్‌ల నుంచి నిజాన్ని ఎందుకు రాబట్టలేదని సతీష్ చంద్ర ప్రశ్నిస్తున్నారు. కుకునూర్‌పల్లి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం ఆశ్చర్యంగా ఉందనీ, పోలీసులు కెమెరా విజువల్స్ ఉన్నాయని చెప్పినా వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదని సతీష్ చంద్ర ప్రశ్నించారు. క్యారెక్టర్ మీద ఫోకస్ ఆపేసి.. క్రైమ్ మీద ఫోకస్ పెట్టండంటూ సతీష్ చంద్ర అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments