Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై విచారణ పూర్తి.. 31న తీర్పు

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (16:56 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు మధ్యంతర బెయిల్ బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. దీనిపై ఇరు తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేస్తూ మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
అంతేకాకుండా, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌పై వాదనలు ఎప్పటి నుంచి ఆలకిస్తామన్న విషయంపై కూడా రేపు నిర్ణయిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు సోమవారం మధ్యాహ్నం వరకు వాదనలు వినిపించగా, మధ్యాహ్నం తర్వాత ఏపీ సీఐడీ తరపున ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. 
 
బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తకోట ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి...  
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం అనూహ్య ఘటన ఒకటి జరిగింది. భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మెదక్ లోక్‌సభ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తకోట ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దాడి ఘటన జరిగింది. రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.
 
ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు, దాడి అనంతరం ఎంపీ కొత్తను ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌‍ నగరంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. 
 
నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు సమాచారం రావడంతో హుటాహుటిన బయలుదేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా రాజు కరచాలనం చేసేందుకు వచ్చి కత్తితో దాడి చేశాడు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేకరిగా పని చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments